ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా | swimming habbit killed two students in khammam district | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా

Jul 12 2015 3:27 PM | Updated on Sep 3 2017 5:23 AM

ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రుద్రంపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు.

రుద్రంపూర్(ఖమ్మం): ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రుద్రంపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. రుద్రంపూర్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన సొహైల్(14), సమీర్(12) స్థానిక పాఠశాలలో తొమ్మిది, ఏడో తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావటంతో స్నేహితులతో కలసి సమీపంలోని గోధుమ వాగులో ఈత కొట్టేందుకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు సమీర్ మునిగిపోతూ కేకలు వేయటంతో అతనిని రక్షించే క్రమంలో సొహైల్ కూడా మునిగిపోయాడు. ఇది గమనించిన మిగతా బాలురు భయంతో ఆ కాలనీలోని వారికి చెప్పేందుకు పరుగు తీశారు. అక్కడి వారు వచ్చేలోగానే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement