అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థినుల మృతి | two students died in Suspicious status | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థినుల మృతి

Feb 24 2016 1:42 AM | Updated on Sep 3 2017 6:15 PM

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థినుల మృతి

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థినుల మృతి

కాట్పాడి సమీపంలో ఇద్దరు విద్యార్థినులు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కాట్పాడి

వేలూరు: కాట్పాడి సమీపంలో ఇద్దరు విద్యార్థినులు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.  కాట్పాడి తాలుకా లత్తేరి సమీపంలోని కాగుంట గ్రామానికి చెందిన మణి కుమార్తె పుణిదవల్లి(19) జంగాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. ఈమె పక్కనున్న ఇంటికి చెందిన అరుల్ కుమార్తె సౌందర్య(15) అదే పాఠశాలలో టెన్త్ చదువుతుంది. సోమవారం సాయంత్రం పాఠశాల ముగించుకొని ఇంటికి వచ్చిన ఇద్దరూ పుణిదవల్లి, సౌందర్య కలిసి బయటకు వెళ్లారు.
 
 అయితే రాత్రి అయినప్పటికీ ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కరశమంగళం రైలు పట్టాల పక్కన రెండు మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారించగా మృతి చెందిన వారు పుణిదవల్లి, సౌందర్యగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసి జోలార్‌పేట రైల్వే పోలీసులు కరశమంగళం వద్దకు చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement