ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం | Two students died | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Nov 9 2015 3:36 AM | Updated on Sep 3 2017 12:14 PM

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్

చివ్వెంల: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్ తండా గ్రామ ఆవాసం భోజ్యతండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భానోతు కౌసల్య, పాపల కుమారుడు ఆనంద్(7).. మోతె మండలం ఉర్లుగొండలోని రావికుంట తండాకు చెందిన గుగులోతు కిషన్, మంగమ్మ కుమారుడు సిద్ధూ(7) ఆదివారం సెలవు దినం కావడంతో గ్రామశివారులోని కోమటికుంట చెరువులోకి ఈతకు వెళ్లారు.

ఈత రాకపోవడంతో చెరువులోకి దిగిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సిద్ధూ భోజ్యతండాలో అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉంటూ సూర్యాపేటలో చదువుకుంటున్నాడు. ఇరు కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒకే కుమారుడు కావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement