breaking news
swimming habbit
-
ప్రాణాలు తీసిన ఈత సరదా
ములుగు(గజ్వేల్): సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద చోటుచేసుకుంది. గజ్వేల్ ఏసీపీ రమేశ్ తెలిపిన మేరకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన బోయిన్పల్లి మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన రాజన్‌శర్మ (27), కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ – 4 మహవీర్ టవర్‌కు చెందిన వండ్లముడి అక్షయ్‌వెంకట్(28), రామ్‌కోఠికి చెందిన రుషబ్‌షాలు మిత్రులు. ఈ ముగ్గురూ ఆదివారం సరదాగా గడిపేందుకు కొండపోచమ్మ సాగర్ వద్దకు కారులో చేరుకున్నారు. వారు కట్టపై కొద్దిసేపు సరదాగా గడిపిన అనంతరం అక్షయ్‌వెంకట్, రాజన్‌శర్మ సాగర్‌లో ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతిచెందారు. సమాచారమందుకున్న గజ్వేల్ ఏసీపీ రమేశ్, గజ్వేల్ రూరల్ సీఐ కమలాకర్, ములుగు, మర్కూక్ ఎస్ఐలు రంగకృష్ణ, శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు గజ్వేల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ములుగు ఎస్ఐ రంగకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: లాభం పేరిట లూటీ! నాలుగు నెలల్లో 48 కేసులు) -
ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
రుద్రంపూర్(ఖమ్మం): ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రుద్రంపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. రుద్రంపూర్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన సొహైల్(14), సమీర్(12) స్థానిక పాఠశాలలో తొమ్మిది, ఏడో తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావటంతో స్నేహితులతో కలసి సమీపంలోని గోధుమ వాగులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు సమీర్ మునిగిపోతూ కేకలు వేయటంతో అతనిని రక్షించే క్రమంలో సొహైల్ కూడా మునిగిపోయాడు. ఇది గమనించిన మిగతా బాలురు భయంతో ఆ కాలనీలోని వారికి చెప్పేందుకు పరుగు తీశారు. అక్కడి వారు వచ్చేలోగానే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.