'కేసీఆర్కు... సీమాంధ్రపై అక్కసే ఎక్కువగా ఉంది' | Sushma Swaraj takes on TRS chief K. Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు... సీమాంధ్రపై అక్కసే ఎక్కువగా ఉంది'

Apr 26 2014 2:30 PM | Updated on Aug 15 2018 8:04 PM

'కేసీఆర్కు... సీమాంధ్రపై అక్కసే ఎక్కువగా ఉంది' - Sakshi

'కేసీఆర్కు... సీమాంధ్రపై అక్కసే ఎక్కువగా ఉంది'

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తనదైన శైలిలో విమర్శించారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తనదైన శైలిలో విమర్శించారు. కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే తెలంగాణ అభివృద్ది కంటే సీమాంధ్ర ప్రాంతంపై అక్కసే ఎక్కువగా కనిపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగం శనివారం తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో కూడా కేసీఆర్ ఇరు ప్రాంతాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

 

తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా ఆ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి సారించకుండా... సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రంపై ఆసూయతో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆమె కేసీఆర్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని సుస్మా స్వరాజ్ ధీమా వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement