లాయర్లదే కీలకపాత్ర | Supreme Court Justice subhash reddy about Lawyers role | Sakshi
Sakshi News home page

లాయర్లదే కీలకపాత్ర

Nov 10 2018 1:51 AM | Updated on Nov 10 2018 1:51 AM

Supreme Court Justice subhash reddy about Lawyers role - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయపాలన సమర్థవంతంగా సాగే విషయంలో న్యాయవాదులదే కీలక పాత్ర అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రధాన న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలు ఆచరణ సాధ్యం కావాలంటే అందుకు న్యాయవాదుల సంపూర్ణ సహకారం ఎంతో అవసరమన్నారు.

ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సుభాష్‌రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాద సంఘాల ప్రతినిధులు శుక్రవారం హైకోర్టులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుభా ష్‌రెడ్డి హైకోర్టుతో, న్యాయవాద సంఘంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఇరు సంఘాల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ ప్రతినిధులు జస్టిస్‌ సుభాష్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement