వడదెబ్బతో వరంగల్ జిల్లాలో గురువారం 12 మంది మృతిచెందారు.
వరంగల్: వడదెబ్బతో వరంగల్ జిల్లాలో గురువారం 12 మంది మృతిచెందారు. వరంగల్ శివనగర్ పుప్పాల గుట్ట ప్రాంతానికి చెందిన నల్లబెల్లి స్వామి(66), డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు చాప్లాతండాకు చెందిన రత్నావత్ మాంజా(75), వరంగల్ ఎల్బీనగర్‌కు చెందిన కూరపాటి మల్లయ్య(76), చిట్యాల మండలం జడల్‌పేట గ్రామానికి చెందిన బొట్ల చంద్రయ్య, (60), అదే మండలం భావుసింగ్‌పల్లికి చెందిన జయ్యారపు కొమురయ్య(62), స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన తాటికొండ లక్ష్మి(54), తొర్రూరు మండలం జమస్థానపురం గ్రామానికి చెందిన పెంతల కొమురయ్య (58), జనగామ రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు, రేగొండ మండలం నిజాంపల్లికి చెందిన ఇంగ్లీ వీరక్క (65), ములుగు మండలం చిన్నగుంటూరుపల్లికి చెందిన తంగెళ్ల లక్ష్మయ్య(55), కేసముద్రం మండలం సబ్‌స్టేషన్‌తండాకు చెందిన గుగులోతు లచ్చిరాం(70), మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మునిగాల కొమురయ్య(75) మృత్యువాత పడ్డారు.