యాసిడ్‌, ఫినాయిల్‌ కలిపి తాగి ఆత్మహత్యాయత్నం

A Suicide Attempt With Acid and Phenyl - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత 

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ 

భువనగిరి– హైదరాబాద్‌ రోడ్డుపై రాస్తారోకో

భువనగిరిఅర్బన్‌ : అనార్యోగంతో బాధపడుతున్న ఓ మహిళ ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నిం చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువా రం తెల్లవారుజామున మృతిచెందింది. వివాహిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జక్కుల అం జనేయులు భార్య జక్కుల పద్మ(35) కొంతకా లంగా అనారోగ్యంతో బాదపడుతోంది. పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలి తం కానరాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ బుధవారం రాత్రి టాయిలెట్‌ క్లీనర్‌ (ఫినాయిల్‌) తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్‌ పరీక్షించి చికిత్స ప్రారంభించారు. అయితే ఓ గంట తర్వాత పద్మ పరిస్థితి విషమంగా ఉం దని బంధువులు డాక్టర్‌కు చూపించారు. ఓ సిరబ్‌ తీసుకురావాలని సూచించారు. అయితే పద్మ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెం దింది. 

రోడ్డుపై రాస్తారోకో.. 
పద్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పద్మ మృతిచెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఉన్న భువనగిరి–హైదరాబాద్‌ రహదారిపై  రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రి ముందు కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేశారు. ఆస్పత్రి వైద్యులు, పోలీసులు బంధువులతో మాట్లాడుతూ పోస్టుమార్టం చేసిన తర్వాత రిపోర్టు ప్రకారం డాక్టర్ల నిర్లక్ష్యం అని తెలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. 

మా నిర్లక్ష్యం లేదు 
పద్మ అనే మహిళ ఫినాయిల్‌ సేవించిందని రాత్రి 2.30 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ ఆమెను పరిక్షించి వైద్యం చేశారు. ఆ మహిళ ఫినాయిల్, యాసిడ్‌ రెండు కలిసి తాగినట్లు తెలిసింది. ఇది చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి తాగడం వలన మనిషిలో అవయావాలన్ని మెల్లగా దెబ్బతింటుంటాయి. ఒక్కసారిగా మరణిస్తారు. డ్యూటీ డాక్టర్‌ నిర్లక్ష్యం ఏమి లేదు.   
– చందులాల్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, భువనగిరి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top