వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌ | Students Illness With Adultry Food in Hostel | Sakshi
Sakshi News home page

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

Jul 16 2019 10:26 AM | Updated on Jul 16 2019 10:26 AM

Students Illness With Adultry Food in Hostel - Sakshi

చికిత్స పొందుతున్న విద్యార్థినులు

రాంగోపాల్‌పేట్‌: కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సికింద్రాబాద్‌ వైఎంసీఏలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ వైఎంసీఏలో బ్లూ అనే సంస్థ గత మూడు నెలలుగా నర్సింగ్, సోలార్‌ కోర్సుల్లో 50 మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. వారికి అక్కడే భోజనం, బస ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం  పూజా, వంశీ, సరస్వతి, యాదమ్మ, దివ్య, నాగలక్ష్మి, ప్రియదర్శిని, భువనేశ్వరి అనే ఎనిమిది మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో నిర్వాహకులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement