యువకుడు అనుమానాస్పద మృతి | student suspicious death | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Mar 30 2015 3:46 PM | Updated on Nov 9 2018 5:02 PM

హైదరాబాద్ నగర శివారులోని ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులోని ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... జయంత్(24) అనే యువకుడు ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం హైదరాబాద్ ఎల్‌బీ నగర్లో నివాసముంటున్నాడు. అయితే సోమవారం ఉదయం నాగోలు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement