గురుకులం నుంచి విద్యార్థిని అదృశ్యం | student missing form garrepally gurukulam | Sakshi
Sakshi News home page

గురుకులం నుంచి విద్యార్థిని అదృశ్యం

Jun 25 2017 9:50 AM | Updated on Sep 5 2017 2:27 PM

పెద్దపల్లిజిల్లా గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

సుల్తానాబాద్: పెద్దపల్లిజిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్ష ఈ పాఠశాలలో 5 తరగతి చదువుతున్నది. శనివారం రాత్రి నుండి కనిపించడంలేదు. అయితే ఈ విషయాన్ని గురుకుల పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఆదివారం ఉదయం శ్రీవర్షను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. అయితే తమ కుఽమార్తె పాఠశాల హాస్టల్‌లో కనిపించలేదు. దీంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement