ప్రఖ్యాత కథకుడు మునిపల్లె రాజు కన్నుమూత

story writer munipalle raju passed away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు కథను సుసంపన్నం చేసిన ప్రఖ్యాత కథకుడు, రచయిత మునిపల్లె రాజు ఇకలేరు. ఏఎస్‌రావు నగర్‌లోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె ఆయన స్వగ్రామం. తండ్రి హనుమంతరావు తల్లి శారదమ్మ. చిన్నప్పటినుంచి కథా సాహిత్యంపై మక్కువ పెంచుకున్న మునిపల్లె రాజు 1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగ్‌ సర్వీసులో సర్వేయర్‌గా ఉద్యోగం చేశారు.

అస్తిత్వనదం ఆవలి తీరాన, దివోస్వప్నాలతో ముఖాముఖి, పుష్పాలు - ప్రేమికులు - పశువులు, మునిపల్లె రాజు కథలు తదితర కథా సంకనాలు వెలువరించారు. అలసిపోయినవాడి అరణ్యకాలు, వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు కవితా సంపుటాలు ప్రచురించారు. ఆయనను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. తెలుగులో మేజిక్ రియలిజంలో మొదటగా రాసిన రచయిత కూడా మునిపల్లె రాజే.

ఆయన గురించి ‘సాక్షి’ సాహిత్యం పేజీలో వచ్చిన ప్రత్యేక వ్యాసం ఇది

మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top