తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు యశోద ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు యశోద ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. సుధాకర్‌కి గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడడంతో కొంతకాలంగా బాధపడుతున్నారు. చికిత్స కోసం నాలుగు రోజుల క్రితం మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరారు.
వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. శనివారమే ఆయన్ను డిశ్చార్జ్ చేయాల్సి ఉండగా, యాంటిబయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చాయి. దీంతో మరో రోజు ఆయన్ని ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చిందని, ఒకటి రెండో రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.