పట్నం దాకా.. పల్లె ‘నీరా’ | Sakshi
Sakshi News home page

పట్నం దాకా.. పల్లె ‘నీరా’

Published Tue, Oct 1 2019 11:26 AM

srinivasareddy speech about neera ni mahabubnagar district - Sakshi

ఆదరణకు నోచుకోని కల్లుగీత కార్మికులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో పాటు ఔషధ గుణాలు కలి గిన నీరాను కార్మికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి విక్రయిం చాలని నిర్ణయించింది. ముందుగా అన్ని జిల్లాల్లో సేకరించి హైదరాబాద్‌కు తరలించనున్నారు. అక్కడి ట్యాంకుబండ్‌ వద్ద స్టాళ్లను ఏర్పాటుచేసి విక్రయించేలా ఎక్సైజ్‌ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. 

సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రతిరోజూ ఉదయం తీసిన నీరా.. పాల ట్యాంకర్ల మాదిరిగా రాష్ట్ర రాజధానికి పెద్ద ఎత్తు న సరఫరా చేయనున్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ చొరవతో ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయి. సంబంధిత ఫైలుపై సీఎం కేసీఆర్‌ సైతం ఆమోదం తెలపడంతో మరో రెండు రోజుల్లో జీఓ విడుదల కావచ్చని అధి కారులు చెబుతున్నారు. అయితే ముందుగా అన్ని జిల్లాల నుంచి నీరాను హైదరాబాద్‌కు తరలించి అక్కడ విక్రయాలని నిర్ణయించారు. ఆ తర్వాత డిమాం డ్‌కు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కల్లు గిరాకీ లేకపోవడంతో గీతకార్మికులకు ఆర్ధిక ఇ బ్బందులు తప్పడం లేదు. చాలా మంది కార్మికులు గీత వృత్తినే మా నేసి ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నా రు. సంప్రదాయ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారు కొందరు మాత్రమే మిగి లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కల్లుగీత కార్మి కులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. 

10వేలకు పైగా మందికి లబ్ధి
ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాం బ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మొత్తం 939 కల్లుగీత సొసైటీలు, పది వేల మంది గీతకార్మికులు ఉన్నారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్, జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గట్టు, ధరూరు, అయిజ, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారకొండ, అచ్చంపేట, కొల్లాపూర్‌ ప్రాంతా ల్లో ఈత, తాటి చెట్లు ఎక్కువగా ఉన్నా యి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 6,27,990 ఈత, తాటి చెట్లు ఉన్నాయి. వీటినుంచి రోజుకు సగం చొప్పున రెండు లక్షల లీటర్ల కల్లు తీస్తారు.

విస్తృత  ప్రచారం 
ఆరోగ్యవంతమైన సమాజం కోసం చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం శీతల పానీయాల కంటే ఔషధ గుణాలు కలిగిన నీరానే తాగేలా విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఇది తాగితే.. కిడ్నీలలో రాళ్లు తొలిగిపోతాయని, క్యాన్సర్, నరాల బలహీనత, మధుమేహం వంటి వ్యాధులకు ఉత్తమ ఔషధమనే ప్రచారానికి త్వరలోనే తెరలేపనుంది. ఇన్ని గుణాలు ఉన్న నీరాను ఇప్పటికే దక్షిణాఫ్రికా, కంబోడియా, అమెరికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలో ఎక్కువగా వాడుతున్నారు. ఏదిఏమైనా ఈ కల్లు కొత్త పాలసీ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని గీతకార్మికులు అభిప్రాయపడుతున్నారు. 

త్వరలోనే జీఓ తెస్తాం 
కల్లుగీత వృత్తికి పూర్వవైభవం తెచ్చేలా హైదరాబాద్‌లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటుచేసి నీరాను విక్రయించాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. గీత కార్మికుల నుంచి సేకరించి వాటిని ఫ్రీజర్లలో పెట్టి రాష్ట్ర రాజధానికి తరలిస్తాం. దీనికి సంబంధించి రెండు రోజుల్లో జీఓ తెస్తాం. ఔషధ గుణాలు కలిగిన నీరాతో కేవలం గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమేగాక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది.  – శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి 

Advertisement
Advertisement