సెల్‌ఫోన్ చోరీ స్పెషలిస్ట్ అరెస్ట్ | Specialist for the theft of a cell phone arrested | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చోరీ స్పెషలిస్ట్ అరెస్ట్

Jun 5 2015 10:57 PM | Updated on Aug 20 2018 4:27 PM

సెల్‌ఫోన్ చోరీ స్పెషలిస్ట్ అరెస్ట్ - Sakshi

సెల్‌ఫోన్ చోరీ స్పెషలిస్ట్ అరెస్ట్

సులభంగా డబ్బులు సంపాదించేందుకు సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న మరొకరిరి దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): సులభంగా డబ్బులు సంపాదించేందుకు సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న మరొకరిరి దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ముషీరాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి మహబూబ్ లదాఫ్(32) ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భవానీనగర్ తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ జహీర్ షా (28) అతనిని సెల్‌ఫోన్ల దొంగతనాలకు పురిగొల్పాడు.

దీనికి అంగీకరించిన మహబూబ్ లదాఫ్ సెల్‌ఫోన్ దుకాణాల వద్ద ఒంటరిగా ఉన్న వ్యాపారులను మాటల్లో దించి ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఫోన్లు చోరీ చేసిన వెంటనే ద్విచక్ర వాహనంపై పారిపోతారు. ఎత్తుకొచ్చిన సెల్‌ఫోన్లను జహీర్‌కు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. జహీర్ వాటిని భాగాలుగా విడగొట్టి అవసరమున్న వారికి పెద్ద మొత్తంలో విక్రయించసాగాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఠాకూర్ సుఖదేవ్‌సింగ్, ఎసై ్సలు గౌస్‌ఖాన్, మల్లేష్, వెంకటేశ్వర్లు దాడి చేసి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement