శెభాష్‌.. షహనాజ్‌

Special Story on Arifa and Roshni Oldage Home in Ashwapuram - Sakshi

ఆదరణకు నోచుకోని వృద్ధులకు ఆపన్న హస్తం 

ఏడేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న ముస్లిం మహిళ 

అశ్వాపురం: కనిపెంచిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనాథలు, అభాగ్యులైన వృద్ధులను చేరదీస్తూ.. మానవత్వం పంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.. షహనాజ్‌బేగం. మండల కేంద్రమైన అశ్వాపురంలో 2011 జూన్‌ 27న మండల పరిధిలోని అమ్మగారిపల్లికి చెందిన షహనాజ్‌బేగం ఆమె సోదరిమణులు వహిదాబేగం, నూర్జహాన్‌బేగం, అరీఫాసుల్తానాలు కలిసి అరీఫా–రోష్ని వృద్ధాశ్రమాన్ని స్థాపించారు.  ఆరు నెలలకే ఆమె సోదరిమణులు వ్యక్తిగత కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లారు. అప్పటినుంచి షహనాజ్‌బేగమే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. అభాగ్యులైన వృద్ధులకు అండగా ఉంటోంది. తమ స్వార్థం కోసమే తాము బతుకుతూ ఇతరుల కష్టాలు తమకెందుకని భావిస్తున్న ప్రస్తుత సమాజంలో వృద్ధులను తన కన్నతల్లిదండ్రులలాగా చూసుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు అభినందిస్తున్నారు.  

7 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం నిర్వహణ
వృద్ధాశ్రమం స్థాపించినాటి నుంచి  తన భర్త సహకారంతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకుసాగుతోంది. మణుగూరు ఏరియా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పురప్రముఖలు, మండల కేంద్ర ప్రజలు, దాతల సహకారంతో వృద్ధులకు ఏడు సంవత్సరాలుగా  అన్ని సౌకర్యాలూ అందిస్తోంది. ఒక్కోసారి ఖర్చులు సొంతంగా కూడా భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అరీఫా–రోష్ని వృద్ధాశ్రమంలో 18 మంది వృద్ధులు ఉన్నారు. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బందులు పడవద్దని ఇటీవల షహనాజ్‌బేగం మండలకేంద్రంలోని మంచికంటినగర్‌లో భూమి కొనుగోలు చేసి వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్థానికుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు.  

సేవే.. సంతోషం  
వృద్ధాశ్రమం నిర్వహిస్తూ.. ఏ దిక్కూ లేని అభాగ్యులైన వృద్ధులకు సేవచేయడం సంతోషంగా ఉంది. నా భర్త ఎస్‌కే.మెహరాజ్, దాతల సహకారంతో ఇబ్బందులు అధిగమించి  ఆశ్రమం నిర్వహిస్తున్నా. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వృద్ధాశ్రమానికి నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేయించాం.  నిర్వహణకు దాతలు çకూడా సహకరించాలి.  
–షహనాజ్‌బేగం, అరీఫా–రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు   

More news

15-02-2018
Feb 15, 2018, 12:35 IST
కాలం కలిసి రాక.. పంట దిగుబడి లేక, మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించక.. వ్యవసాయాన్ని వదిలి  ఎంతో మంది రైతులు...
15-02-2018
Feb 15, 2018, 11:40 IST
అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి...
15-02-2018
Feb 15, 2018, 09:36 IST
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళలు చదువుకుంటే కుటుంబమంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇంటిలో అన్ని వ్యవహారాలు సమర్థంగా చక్కదిద్దుకుంటుంది....
15-02-2018
Feb 15, 2018, 08:07 IST
‘‘స్టీఫెన్‌ హాకిన్స్‌.. అసాధ్యాలను సుసాధ్యం చేసి యావత్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఈ శాస్త్రవేత్త దివ్యాంగుడు. మూడు చక్రాల బండిలో కూర్చొని...
15-02-2018
Feb 15, 2018, 00:59 IST
‘యు కెన్‌ డు’ అని ఆడవాళ్లను బయటికి పంపిస్తే సరిపోయిందా! ‘ఐ కెన్‌ డు ఇట్‌’ అని ఇంట్లో పూచికపుల్లను అటు...
15-02-2018
Feb 15, 2018, 00:54 IST
గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌లో వచ్చిన అనుచితమైన మెసేజ్‌కు కన్నడ నటి దీప్తి కాప్సే స్పందించిన తీరుకు ఆమెపై...
15-02-2018
Feb 15, 2018, 00:48 IST
రాణులంటే చుట్టూ సేవలందించే మందీ మార్బలం, సకల హంగులు అమరే జీవనంగా మన కళ్ల ముందొక దృశ్యం నిలుస్తుంది. కానీ,...
15-02-2018
Feb 15, 2018, 00:41 IST
ఉదయాన్నే తయారై.. చీర సవరించుకుని సజావుగా నల్ల కోటు వేసుకుని అద్దం ముందు నిలబడింది. అబ్బ! అచ్చం న్యాయం నిలబడినట్లే...
15-02-2018
Feb 15, 2018, 00:38 IST
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనోబలం, శ్రమించే గుణం, సమస్యను సవాల్‌గా స్వీకరించే తత్వం ప్రధానం. ఇలా...
15-02-2018
Feb 15, 2018, 00:30 IST
లేబర్‌ రూమ్‌ అరుపుల్ని మగవాడు వినాలి. అవి ఇంట్లో గదిలో అర్ధరాత్రి ఏకాంతంలో వినవచ్చే మూల్గులు కావు. అరుపులు. కేకలు....
14-02-2018
Feb 14, 2018, 14:03 IST
ముంచుద్దో లాభమొస్తదో..చెప్పలేని ఎవుసాన్ని మహిళలు ధైర్యంగా చేస్తున్నారు. కుటుంబ భారం మోసేందుకు, తమపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు లాభాల...
14-02-2018
Feb 14, 2018, 13:53 IST
కడదాకా కలిసుంటానన్న మగ దిక్కు మధ్యలో ‘కాడి’ దింపేశాడు. అప్పులు బాధతో కొందరు, అనారోగ్యంతో మరికొందరు భార్య, పిల్లలను వదిలేసి...
14-02-2018
Feb 14, 2018, 13:00 IST
నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ వ్యవ‘సాయం’ చేస్తున్న వారు...
14-02-2018
Feb 14, 2018, 12:57 IST
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ...
14-02-2018
Feb 14, 2018, 12:03 IST
తాగుడుకు బానిసై ఒకరు.. విద్యుదాఘాతానికి గురై మరొకరు.. మనస్తాపంతో ఇంకొకరు..! ఇలా వేర్వేరు కారణాలతో ఇంటి యజమానులు కుటుంబాన్ని వదిలేసి కానరాని...
14-02-2018
Feb 14, 2018, 10:05 IST
అడగకుండానే ఆకలి పేగులకు అన్నం ముద్దయ్యేఅమృతమూర్తి అమ్మ కూడా ఓ ఆడపిల్లే..కష్టాల సగాన్ని కడుపులో దాచుకుని..  ఆనందాలసగాన్ని కట్టుకున్నోడికి పంచే...
14-02-2018
Feb 14, 2018, 02:12 IST
‘‘వస్తావా!’’ ఇదీ ప్రేమించిన వాడి దగ్గర్నుంచి ఇప్పటి దాకా తను విన్న మగవాడి కూత. కానీ, తనకు ఆ వికృత...
14-02-2018
Feb 14, 2018, 02:05 IST
పెద్దలంతా కలిసి ముహూర్తం పెట్టారు. శుభముహూర్తం అని భర్త తరుఫు వాళ్లు అన్నారు. ఇటు పక్కవాళ్లు నోరు మూసుకున్నారు. ఎవరికి...
14-02-2018
Feb 14, 2018, 01:29 IST
తరం మారి తరం వచ్చింది. తరం మారి తరం వస్తుంది కూడా. అప్పుడు కూడా.. ఇలాంటి ఉత్తరమే వస్తుంది. సరస్వతీదేవి,...
14-02-2018
Feb 14, 2018, 01:19 IST
♦  పోకడకు భిన్నంగా మీ అమ్మ నాన్న మిమ్నల్ని  పెంచి పెద్దచేశారా? ♦  ఎటువంటి వివక్షా అంటకుండా ఎదగనిచ్చారా? ♦  అన్నింటా మీ...

More Photos

More Videos

Back to Top