జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక | special plans for district development | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Nov 19 2014 2:30 AM | Updated on Sep 2 2017 4:41 PM

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

ప్రగతినగర్ :జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూ పొందిస్తున్నామని పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇందుకోసం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్‌తో కలిసి సమష్టి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. గత పాల కుల ని ర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ అభివృద్ధి కుం టుపడిందన్నారు. 1974 సంవత్సరంలోనే నిజామాబాద్ మాస్టార్ ప్లాన్ తయా రు చేశారని, ఇప్పుడు 2014 సంవత్సరంలో ఉన్నామన్నారు. 40 సంవత్సరాల తేడా కనిపిస్తున్నా నగరం మాత్రం అలాగే ఉండిపోయిం దన్నారు.

 నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ తీరు అధ్వానంగా మారిన విషయం అందరికీ తెలుసేనన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, బైపాస్ నిర్మాణాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. గత పాలకులు చేశామా...అంటే చేశామా అన్నట్లుగా నిజామాబాద్ మున్సిపాలిటీని,మున్సిపాల్ కార్పొరేషన్‌గా మార్చారన్నారు. బంగా రు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ అర్బన్‌ను స్మార్ట్‌సిటీగా, మాస్టర్ ప్లాన్ నిర్మాణం, పెం డింగ్‌లో ఉన్నా బైపాస్‌రోడ్డు నిర్మాణాలపై నా లుగు గంటలపాటు ఎమ్మెల్యే లు, మేయర్ సుజాత, కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. వీలైనంత తొం దరగా నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ కు టెండర్‌లు పిలవనున్నామన్నారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ నిజామాబాద్‌గా మార్చాలంటే 12 గ్రామాలు విలీ నం చేయాల్సి ఉంటుందన్నారు. నగరాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీగా మార్చాలంటే గ్రా మాలు పంచాయతీలుగానే ఉండాల్సి వస్తుందన్నారు. స్మార్ట్ సిటీ ప్లాన్ కోసం హైదరాబాద్ నుంచి అధికారులను పిలిపించామని కవిత తెలిపారు. ఐఏఎస్‌ల విభజనలో కొంత మంది జిల్లా అధికారులు ఆంధ్రాకు కేటాయిం చబడ్డారనీ కవిత పేర్కొన్నారు. జిల్లాలో ముఖ్య మైన ఐఏఎస్ పోస్టులు కలెక్టర్, మున్సిపాల్ కమిషనర్,డ్వామా పీడీల కేటాయింపు కేంద్రం పరిధిలో ఉందన్నారు.

నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధికి ఎప్పటికప్పు డు అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ  ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని,అయితే వైద్య సేవల్లో ఎలాంటి లోటు కలుగకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలి పారు. నిజామాబాద్ నగర జనాభా దృష్ట్యా మరో తహశీల్ కార్యాలయం ఏర్పాటు కోసం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రూరల్ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు లో బ్రిడ్జికి ఇరువైపుల రోడ్డు నిర్మాణానికి  చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రిడ్జిపై చిన్న చిన్నపాటి మరమ్మతులు  త్వరలో పూర్తి చేస్తామన్నారు.సమావేశంలో నగర మేయర్ సుజా త, డిప్యూటీ మేయర్ ఫయీమ్ పాల్గొన్నారు.

 90 శాతం దరఖాస్తుల పరిశీలన
 ప్రభుత్వ పథకాల అమలు కోసం నిరంతరం జిల్లా యం త్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ రోనాల్డ్‌రో స్ అన్నారు. సమగ్ర సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులను 90 శాతం పరి శీలించామని తెలిపారు. వికలాంగుల కోసం గత నెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేయగా 12 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 6,500 మంది వికలాంగుల ను అర్హులుగా గుర్తించామన్నారు. ఈ నెల ఎవరికైనా పింఛన్లు రాకుంటే వచ్చేనెల రెం డు నె లల పింఛన్ పంపిణీ చేస్తామన్నారు.ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  మౌళిక వసతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement