రాచ‘కొండ’ంత అండ

Special Cell For Retired Police Staff Rachakonda - Sakshi

పెన్షన్‌ డెస్క్‌ను ప్రారంభించిన సీపీ మహేష్‌ భగవత్‌

పెన్షన్, బెనిఫిట్స్‌ అన్ని ఒకేసారి పొందేలా చర్యలు

ఆరు నెలల ముందే సమస్యల పరిష్కారం

సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగ విరమణ పొందనున్న పోలీసు సిబ్బందికి రాచ‘కొండ’ంత అండగా నిలవనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేసే ఉద్యోగులకు పెన్షన్, బెనిఫిట్స్‌ మొత్తం ఒకేసారి పొందేందుకు ఉద్దేశించిన ‘పెన్షన్‌ డెస్క్‌’ను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ ఆదివారం ప్రారంభించారు. అడ్మిన్‌ డీసీపీ, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్‌ అధికారులు, పోలీస్‌ అధికారుల సంఘం సభ్యులుగా ఉండే ఈ డెస్క్‌ ప్రతి నెలా మూడో శనివారం సమావేశమై పదవీ విరమణ చేసే సిబ్బందిని ఆరు నెలలు ముందుగానే కార్యాలయానికి పిలిపించి వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ‘పెన్షన్‌ పత్రాలు పూర్తి చేసి పదవీ విరమణ పొందే రోజున అన్ని బెనిఫిట్స్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల పెన్షన్‌ సమస్యలను పరిష్కరిస్తార’ని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

ఈ సందర్భంగా రానున్న 6 నెలల్లో పదవీ విరమణ పొందనున్న 29 మంది ఉద్యోగులతో సీపీ మహేష్‌ భగవత్‌ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ముందస్తుగా పెన్షన్‌కు అప్లై చేసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి బెనిఫిట్స్‌ సకాలంలో అందేటా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగాæ మొబైల్‌ నెంబర్‌ ఏర్పాటు చేయాలని అడ్మిన్‌ అధికారులను కోరారు. జాయింట్‌ సీపీ సుధీర్‌ బాబు మాట్లాడుతూ పెన్షన్‌ డెస్క్‌ ఏర్పాటుతో  ముందస్తుగా పెన్షన్‌ పేపర్స్‌ సబ్మిట్‌ చేయడంతో సర్వీసులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో పదవీ విరమణ పొందిన రోజే పెన్షన్‌ తీసుకునే వీలు కలుగుతుందన్నారు.  పదవీ విరమణ  పొందనున్న, పొందిన, చనిపోయిన పోలీస్‌ సిబ్బందికి పెన్షన్, బెనిఫిట్స్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా వచ్చేలా ’పెన్షన్‌ డెస్క్‌’ ప్రారంభించిన రాచకొండ సీపీకి పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ భద్రా రెడ్డి కృత/æ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో రాచకొండ అడ్మిన్‌ ఏసీపీ శిల్పవల్లి, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ భద్రా రెడ్డి, సభ్యులు జి.క్రిష్ణా రెడ్డి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top