'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే' | sonia gandhi role should be submitted in telangana history, says uttam kumar reddy | Sakshi
Sakshi News home page

'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే'

Apr 13 2015 2:41 PM | Updated on Sep 19 2019 8:44 PM

'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే' - Sakshi

'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే'

తెలంగాణ చరిత్రపై రూపొందిస్తున్న పాఠ్యాంశాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రను చేర్చాల్సిందేనని టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

హైదరాబాద్:తెలంగాణ చరిత్రపై రూపొందిస్తున్న పాఠ్యాంశాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రను చేర్చాల్సిందేనని టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం బీజేపీ భూసేకరణ ఆర్డినెన్స్ పై పీసీసీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ చరిత్రపై రూపొందిస్తున్న పాఠ్యాంశాల్లో సోనియా పాత్రను తప్పకుండా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై పార్టీ తరుపున కేసీఆర్ కు లేఖ రాస్తున్నామని స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డీఎస్ అధ్యక్షతన కమిటీని నియమించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అకాల వర్షంతో రైతులు నష్టపోయారని.. నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement