తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్‌ కుమార్‌ | Somesh Kumar As The New CS Of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్‌ కుమార్‌

Dec 31 2019 4:31 PM | Updated on Dec 31 2019 8:06 PM

Somesh Kumar As The New CS Of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌ కుమార్‌.. రేపటి నుంచి (జనవరి 1) సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్‌ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది.

నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగనున్నారు. అలాగే నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. ఇక బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సోమేశ్‌ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement