
సాక్షి, రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచార నిమిత్తం వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ డప్పు చేతపట్టి స్టెప్పులేయడంతో అందరిలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. అదే విధంగా ఆయన ఫొటోతో ఉన్న మాస్క్‌లను ధరించి పలువురు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేపట్టడం అందరినీ ఆకట్టుకుంది.