సౌర శక్తి.. విద్యుత్ కాంతి


సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వాలు

ఆసక్తి చూపుతున్న రైతులు
విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రైతులు, చిరు వ్యాపారులు, గృహ విద్యుత్ వినియోగదారులు ప్రస్తుతం సౌర విద్యుత్‌పై ఆసక్తిని కనబరుస్తున్నారు. సౌర విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం, సబ్సిడీపై ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమైన పోచారంలో ఇటీవల సోలార్‌పవర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. దీని సహాయంతో మోటార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. రైతు లు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ప్లాంట్ పనితీరు తెలుసుకుని వెళుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతు న్న విద్యుత్‌తో పంపుసెట్లు 12 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. దీంతో తమ చేన్లలోనూ సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవాలని రైతులు యోచిస్తున్నారు.సౌర విద్యుత్ ప్లాంట్ గురించిసౌర విద్యుత్ ప్లాంట్ యూనిట్ సామర్థ్యాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. ఒకసారి పెట్టుబడి పెడితే దశాబ్దా ల పాటు ఇది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుం ది. ఒక కేవీ సామర్థ్యం గల యూనిట్ ఏర్పాటుకు రూ.లక్షా 45 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని అం దిస్తాయి. ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వ్యక్తి 10 శాతం వెచ్చిస్తే, 40 శాతం బ్యాంకు రుణం ఇస్తారు. మిగతా 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఒక కిలో వాట్ విద్యు త్ ఉత్పత్తి సామర్థ్యం గల పవర్ ప్లాంట్‌తో 100 వాట్స్ బల్బులు పది, లేదా 5 బల్బులు, 2 ఫ్యాన్లు పనిచేస్తాయి. ఇలా 5 కేవీ సామర్థ్యం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి. అంతకు మించి సామర్థ్యం గల యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే సబ్సిడీ ఇస్తోంది.ఇక వ్యవసాయ విద్యుత్ కోసం పంపు సెట్‌కు ఏర్పాటు చేసే ప్లాంట్‌కు రూ. 3లక్షల ఖర్చు వస్తుం ది. ఇందులో రైతు లక్ష రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వం లక్ష రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తాయి.

 

విద్యుత్ అమ్ముకోవచ్చు..ఇంటి వద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే అవసరానికి వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను ట్రాన్స్ కో కొనుగోలు చేస్తుంది. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం నెడ్ క్యాప్ సంస్థను లేదా విద్యుత్ అధికారులను సంప్రదించాలి. ఇళ్లతో పాటు ప్రభు త్వ, ప్రైవేటు కార్యాలయాలు, కుటీర పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, పాఠశాలల్లో అవసరానికి అనుగుణంగా సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పా టు చేసుకోవచ్చు. పైకప్పు విస్తీర్ణాన్ని బట్టి ఒకటి నుంచి 50 కిలో వాట్‌ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉంటుంది.

 

అందుబాటులో స్మార్ట్ పరికరాలు సౌర విద్యుత్‌లో నూతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి పైకప్పుపై పెద్ద పెద్ద ప్లేట్లను అమర్చడం ద్వారా ఇంట్లో విద్యుత్ రావడంతో పాటు తక్కువ ధరతో మనకు అవసరమున్న పరికరాలు విడివిడిగా దొరుకుతున్నాయి. ఒక ఫ్యాన్, రెండు బల్బులు వెలిగే సిస్టమ్‌న రూ. 6 వేలకు అం దిస్తున్నారు. గార్డెన్ లైట్లు, టెయిల్ లైట్లు, వాటర్ హీటర్, ఏసీ, టీవీ, టార్చిలైట్, సెల్ చార్జింగ్, లాంతర్లు తదితర వస్తువులకు ప్రత్యేకంగా ప్యానెల్‌లను అమర్చే విధానం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top