విశాఖ: విశాఖ కేజిహెచ్‌లో పవర్ కట్ కావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వాటర్ పైప్ లైన్ ట్రెంచ్ తీస్తుండగా పవర్ లైన్ కట్ అయింది. మధ్యాహ్నం పవర్ లైన్ తెగిపోయినా సాయంత్రం పునరుద్దరణ పనులు వరకూ మొదలు కాలేదు.
మరో గంట నుంచి రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పునరుద్దరణ పనులను సూపరింటెండెంట్ వాణి పరిశీలించింది.
కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని కీలక విభాగాల్లో అంధకారం. సహనం కోల్పోతున్న రోగులు. ఇబ్బందులు పడుతున్న రోగుల బంధువులు.
సాక్షి టీవీతో కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణి
- కేజీహెచ్ లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు మరో రెండు గంటల సమయం పడుతుంది
- క్రిటికల్ కేర్ బ్లాక్ వద్ద పనులు చేస్తుండగా పవర్ కేబుల్ కట్ అయింది
- జనరల్ వార్డుల్లో కరెంటు లేక రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే
- ఇలా జరగడం చాలా బాధాకరం
- ఎమర్జెన్సీ వార్డులకు జనరేటర్ల ద్వారా పవర్ అందిస్తున్నాం
- పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటా
- నేను ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చాను పనులు పర్యవేక్షిస్తున్నాను


