breaking news
King George Hospital
-
హామీలు ఇచ్చే వరకు ధర్నా ఆగదు..
-
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె
-
కేజీహెచ్‌లో సోలార్ పవర్ ప్లాంట్
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/గాజువాక: కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సమక్షంలో కేజీహెచ్‌లోని సీఎస్ఆర్ బ్లాక్ రూఫ్ టాప్‌లో సౌర విద్యుత్‌ను ఇన్స్టాలేషన్ చేయడానికి ఎంవోయూ జరిగింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద వైజాగ్ అసెట్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన ఈ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ ద్వారా కేజీహెచ్‌లో విద్యుత్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏఎంఎన్ఎస్ ఇండియా లిమిటెడ్ హెడ్, హెచ్ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు. రూ.670 కోట్లతో 1,125 పీహెచ్‌సీల ఆధునికీకరణ రాష్ట్రంలోని 1,125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.670 కోట్లతో ఆధునికీకరించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన కణితి పీహెచ్సీ భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను నిర్మిస్తున్నామన్నారు. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం జగనన్న ప్రభుత్వం రూ.1,223 కోట్లను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రూ.8,500 కోట్లను ఖర్చు చేస్తున్నారన్నారు. టీచింగ్ ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం రూ.3,820 కోట్లు కేటాయించామని తెలిపారు. -
విశాఖ ఆస్పత్రిలో మృత శిశువు తరలింపు కలకలం
-
ఉత్తరాంధ్రకు మకుటంలా కింగ్ జార్జ్ ప్రభుత్వాసుపత్రి (ఫొటోలు)
-
విశాఖలో విషాదం: కరోనాతో ఏడాది చిన్నారి మృతి
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి కోవిడ్ బారిన పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన మానవ హృదయాల్ని కలిచివేసింది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఓ చిన్నారికి మూడు రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో చిన్నారిని కేజీహెచ్‌కు తీసుకురాగా అడ్మిషన్ ఇచ్చే లోగా అంబులెన్స్‌లోనే ప్రాణం విడిచింది. తన బిడ్డను కాపాడాలని ఆ తల్లిదండ్రులు చేసిన రోదన కేజీహెచ్ పరిసరాల్లో విషాదం నింపిన ట్టు అయింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్లో పని చేస్తున్నారు. ఇతనికి ఏడాది వయసు పాప జ్ఞానిత. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాపకు నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. స్థానిక వైద్యుల సూచన మేరకు సన్‌రైజర్ ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు లక్షల రూపాయలకు పైగా ఖర్చయింది. ఇంకా వ్యాధి నయం కాకపోవడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో చిన్నారిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అక్కడి చిన్నారిని మరో కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి వైద్యులు కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో చిన్నారిని పట్టుకొని కుటుంబ సభ్యులు కింగ్ జార్జి ఆసుపత్రిలోని కోవిడ్ బ్లాక్‌కు అంబులెన్స్‌లో చేరుకున్నారు. ఆస్పత్రిలో అడ్మిషన్ పొందేలోగా చిన్నారి అంబులెన్సులోనే మృతి చెందింది. మూడు రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం ప్రయత్నించి ఆఖరి క్షణంలో చిన్నారి జ్ఞానిత మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ సంఘటన కేజీహెచ్ పరిసరాల్లో ప్రజలను ...రోగుల బంధువులను కలిచివేసింది చదవండి: కరోనా సునామీ : దలైలామా సాయం -
అందనంత ఎత్తులో వైద్యం!
సాక్షి, విశాఖపట్నం : కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్) చర్మవ్యాధుల విభాగం రోగులకు అందుబాటులో లేకుండా పోతోంది. ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. వృద్ధులు, వికలాంగులు మెట్ల మార్గం ద్వారా రెండంతస్తులు ఎక్కడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలను తల్లులు ఎత్తుకుని అంత ఎత్తు ఎక్కలేకపోతున్నారు. అక్కడ లిఫ్ట్ కూడా లేదు. లిఫ్ట్ ఏర్పాటు చేసే అవకాశమూ లేదు. అలాగే ర్యాంపు కూడా లేదు. దీంతో ఎక్కడెక్కడ నుంచో ఉచిత వైద్యానికి వచ్చే ఈ పేద రోగులు రెండంతస్తులను పడుతూ లేస్తూ ఎక్కుతున్నారు. ఈ చర్మ వ్యాధుల ఓపీకి రోజుకు 150 నుంచి 200 మంది వరకు సగటున నెలకు ఐదు వేల మంది వస్తుంటారు. వీరిలో పది శాతం మంది వయో వృద్ధులు, చిన్నారులే ఉంటున్నారు. వీరు ఒకసారి ఓపీ చూపించుకున్నాక దిగువన ఉన్న మందుల కౌంటరు వద్దకు మందుల కోసం, ఇతర పరీక్షల కోసం రావలసి వస్తోంది. ఒక్కసారి ఎక్కడానికే నానా బాధలు పడుతున్న వీరు రెండోసారి రెండంతస్తులు ఎక్కి దిగడం వారి వల్ల కావడం లేదు. అలా మెట్లెక్కలేని వారు విధిలేని పరిస్థితుల్లో కేజీహెచ్ ఎదురుగాను, పరిసరాల్లోనూ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ స్తోమతు కూడా లేని వారు ఓపిక కూడగట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కి వైద్యం అందుకుంటున్నారు. విచిత్రమేమిటంటే కేజీహెచ్ పరిసరాల్లో ఉన్న చర్మవ్యాధుల ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో కేజీహెచ్‌లో పనిచేస్తున్న కొంతమంది చర్మవ్యాధి వైద్యులవే కావడం విశేషం. కేజీహెచ్ ఓపీకి వెళ్లలేని వారంతా సమీపంలో ఉన్న చర్మ వ్యాధుల ఆస్పత్రుల్లో వైద్యానికి వెళ్తున్నారు. ఇలా రెండో అంతస్తులో చర్మ వ్యాధుల ఓపీ బ్లాక్ ఉండడం పరోక్షంగా ఆ వైద్యులకు బాగా కలిసొస్తోంది. అందువల్లే ఈ కేజీహెచ్ ఓపీ బ్లాక్ ఎంతగా అందుబాటులో లేకపోతే అంతగా వీరికి లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ వైద్యులకు హృద్రోగం కేజీహెచ్ చర్మ వ్యాధుల విభాగంలో 14 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు, మరో ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ముగ్గురు సీనియర్లలో ఇద్దరు హృద్రోగంతోను, ఒకరు ఆర్థరైటిస్తోనూ బాధపడుతున్నారు. గుండె జబ్బులతో ఉన్న వారు రెండంతస్తుల మెట్లు ఎక్కడం ప్రమాదం కావడంతో వారు దిగువన ఉన్న వార్డుకే పరిమితమవు తున్నారు. ఆర్థరైటిస్ వల్ల మరో మహిళా వైద్యురాలు కూడా ఓపీకి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కొద్దిమందే ఓపీ చూస్తున్నారు. సైకియాట్రీ వార్డుకు మార్చాలి.. ఈ పరిస్థితుల నేపథ్యంలో దిగువన (గ్రౌండ్ ఫ్లోర్లో) నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న సైకియాట్రీ వార్డును చర్మవ్యాధుల ఓపీకి కేటాయించాలని, లేనిపక్షంలో దిగువనే మరో చోట ఇవ్వాలని ఆ విభాగం వైద్యులు చాన్నాళ్లుగా కోరుతున్నారు. అయినప్పటికీ ఆ మార్పు జరగడం లేదు. గత ఏడాది నవంబర్‌లో ఒకసారి, రెండ్రోజుల క్రితం మరొకసారి వీరు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. పరిశీలించి కేటాయిస్తాను.. చర్మవ్యాధుల ఓపీని గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. అయితే ఖాళీగా ఉన్న సైకియాట్రీ వార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినందున ఈ ఓపీకి కేటాయించడానికి వీల్లేదు. చర్మవైద్యుల్లో హృద్రోగంతో ఉన్న వారు ఉన్నారు. వీరి ఇబ్బందులను, రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్ ఫ్లోర్‌ను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నాను. – డా.జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో రోగులకు అసౌకర్యాలు
-
చీకట్లో విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్
-
చీకట్లో కేజీహెచ్
ఆరుబయట నిద్రిస్తున్న వీరిని చూసి.. ఎక్కడినుంచో వచ్చిన కాందిశీకులో.. గూడు లేని పక్షులో అనుకునేరు!.. వారంతా రోగులు.. వారికి సహాయంగా వచ్చిన బంధువులు... ఆ ఆవరణ.. ఉత్తరాంధ్రకే పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్).. మరి ఏమిటీ దుస్థితి.. హాయిగా ఆస్పత్రిలోనే వార్డుల్లో.. ఫ్యాన్ల కింద సేదదీరవచ్చుగా?!.. అన్న అనుమానం రావచ్చు.. సేదదీరవచ్చు.. కానీ కరెంటు ఉంటే కదా.. అది లేకే ఈ అగచాట్లు.. ఇంతకూ విషయమేమిటంటే.. కేజీహెచ్ మార్చురీ సమీపంలో జరుగుతున్న నిర్మాణపనుల్లో పొక్లెయిన్ ధాటికి అండర్‌గ్రౌండ్ కేబుల్స్ పూర్తిగా కట్ అయిపోయాయి. దీంతో ఆస్పత్రి మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు గానీ అధికారులకు ఈ విషయం తెలియలేదు.. తెలిసిన వెంటనే ఉరుకులు.. పరుగుల మీద పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. సుమారు ఏడు గంటల నరకయాతన అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో రోగులు ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నం : పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో అంధకారం అలముకుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు నరకం చూశారు. గంటల తరబడి విద్యుత్ పునరుద్ధరణ జరగకపోవడంతో రోగులు రోడ్డున పడ్డారు. మార్చురీ సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌కు నీరు సరఫరా రాకపోవడంతో భూగర్భం నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైరును యూజీడీ పనులు చేస్తున్న పొక్లెయిన్‌తో తవ్వించడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే విద్యుత్ నిలిచిపోయినప్పటికీ దాదాపు రెండు గంటల పాటు ఈ విషయం కేజీహెచ్ అధికారులకు తెలియనీయలేదు. సాయంత్రం ఐదు గంటలకు విద్యుత్ సరఫరా లేదన్న సంగతిని తెలుసుకుని విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. పొక్లెయిన్‌తో తవ్వడంతో వైర్లు బాగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వైర్ల స్థానంలో కొత్తవి వేశారు. దీనికంతటికీ దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. దీంతో కేజీహెచ్‌లో ప్రధానంగా గైనిక్, భావనగర్, రాజేంద్రప్రసాద్, చిన్నపిల్లల వార్డుల్లో రోగులు అవస్థలు పడ్డారు. వెంట వచ్చిన సహాయకులు తమ రోగులను మంచాలపై నుంచి బయటకు తీసుకొచ్చి సపర్యలు చేశారు. తీవ్ర అస్వస్థతతో ఉండి మంచాలపై నుంచి కదిల్చే వీలు లేని వారిని అక్కడే ఉంచేశారు. ఒకట్రెండు వార్డుల్లో జనరేటర్‌తో విద్యుత్ సదుపాయం కలిగించినా అవి అత్యవసర సేవలకే పరిమితమైంది. దాదాపు ఆరున్నర గంటల తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో ఎట్టకేలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విచారణకు ఆదేశించాం కేజీహెచ్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై విచారణకు ఆదేశించాం. ఎవరో ఉద్దేశపూర్వకంగానే పొక్లెయిన్‌తో కేబుళ్ల ను తవ్వించి ఉంటారని అనుమానిస్తున్నాం. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఒక ఏఈ, మరొక డీఈలతో కమిటీని ఏర్పాటు చేశాం. అత్యవసర విభాగాల్లో రోగులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఆయా వార్డుల్లో జనరేటర్‌తో విద్యుత్ సరఫరా ఇచ్చాం. – జి.అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
పురుడు కోసం వస్తే..
కేజీహెచ్‌లో గర్భిణులకు అష్టకష్టాలు ఒకే మంచంపై ముగ్గురేసి బాలింతలు కేజీహెచ్ : ‘బాలింతలు కష్టాలు పడనక్కర్లేదు. మాతా శిశు మరణాలు అదుపులోకి వచ్చారుు. గర్భిణీలకు ప్రభుత్వం తరఫున ఎన్నో ప్రోత్సహకాలు. గర్భిణీగా ఆస్పత్రికి వస్తే డెలివరీతో పాటు తల్లి, పిల్లను ఇంటికి చేర్చే బాధ్యత కూడా మాదే’ లాంటి ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆయా ప్రకటనలు..ప్రకటనలుగానే మిగిలిపోతున్నారుు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్గడ్, గోదావరి జిల్లాల నుంచి కేజీహెచ్‌కు వస్తున్న గర్భిణీలు, బాలింతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయినా ఇక్కడ వారికి కష్టాలు తప్పడం లేదు. ఒకే బెడ్‌పై ఇద్దరేసి, ముగ్గురేసి చొప్పున చికిత్స పొందడం, డెలీవరీ అయిన తరువాత నలుగురైదుగుర్ని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో కుక్కేయడం, బాలింతలకు బెడ్లు లేక కిందనే కూర్చోవడం ఇక్కడి కేజీహెచ్‌తో నిత్యకృత్యమైపోతోంది. సాధారణ కాన్పు, సిజేరియన్ కాన్పు బాలింతలు ప్రసూతి వార్డుల్లో పడుతున్న కష్టాలు చూస్తుంటే 9నెలలపాటు బిడ్డను మోసే కష్టాల కంటే ఇవే ఎక్కువంటూ ఆడపడుచులు రోధిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకుంటే తల్లి, పిల్ల ఇద్దరూ క్షేమం అంటూ సూచనలిస్తున్న ప్రభుత్వం ప్రసూతి, లేబర్ రూం. ఎన్ఐసీయూ, తల్లి, బిడ్డను ఇంటికి చేర్చడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదన్న ఘటనలతో బుధవారం కేజీహెచ్‌లో సాక్షికి చిక్కిన ఈ దృశ్యాలే ఉదాహారణ. -
పండగొస్తోంది.... జీతం కావాలంటోంది.!
అష్టకష్టాలు పడుతున్న కేజీహెచ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఆరు నెలలుగా జీతాలు బంద్ సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్, నర్సుల పస్తులు పట్టించుకోని కాంట్రాక్టర్లు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదారుుని కేజీహెచ్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది పస్తులుంటున్నారు. ఆర్నెల్లగా జీతాలు అందక పోవడంతో పిల్లలకు స్కూళ్ల ఫీజులు కట్టలేక, రేషన్, ఇంటి అద్దెలు చెల్లించలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టర్ కూడా వీరిని పట్టించుకోవడం లేదు. కనీసం చాలా మంది సిబ్బందికి కాంట్రాక్టర్ కూడా ఎవరో తెలియదు. సూపర్వైజర్లే మొత్తం కథ నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలి. ఆరు నెలలుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ నంబర్లు కూడా రాలేదు. ఒకవేళ మధ్యలో ఉద్యోగం వదలి వెళ్లిపోతే.. ఇంతకాలం పనిచేసిన కాలానికి జీతం చెల్లించరని వాపోతున్నారు. మరో వైపు పండగొస్తోంది. జీతాలు లేక ఎలా పండగ జరుపుకోవాలని వారంతా ఆవేదన చెందుతున్నారు. - కేజీహెచ్ ఇదీ పరిస్థితి.. కేజీహెచ్‌లో జేబీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో 172 మంది గార్డులు, సూపర్ వైజర్లు పనిచేస్తున్నారు. కొత్తగా నిర్వహణ బాధ్యతలను తీసుకున్న ఈ సంస్థ 12 శాతం తక్కువకు పనులను చేజిక్కించుకుం ది. మే నుంచి గార్డులను సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి నేటి వరకు గార్డులకు జీతం కింద చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. కాంట్రాక్టు తీసుకున్నప్పుడు పని చేస్తున్న వారికి ఒకటి లేదా రెం డు నెలల జీతాలు ముందుగా కాంట్రాక్టర్ చెల్లించాలి. ప్రస్తుతం కేజీహెచ్‌లో వారిని పట్టించుకున్న నాథుడే లేడు. హౌస్ కీపింగ్ కింద కేజీహెచ్‌లో 230 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ముంబైకి చెందిన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. వీరికి కూడా గడిచిన నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. వీరికి ప్రతినెలా రూ.41.92 లక్షల జీతాలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు పాసైతే వీరికి జీతాలు. లేదంటే ఎన్ని నెలలు అరుునా పస్తులుండాల్సిందే. ఈ ఏడాది మార్చి నుంచి కాంట్రాక్టు పద్ధతిలో 160 మంది వరకు నర్సులను విధుల్లోకి తీసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు రెండు నెలల జీతాలు మాత్రమే అందాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్ సిబ్బంది ప్రతి నెల 11న జీతాల బిల్లులు పెడితే.. ట్రెజరీ నుంచి విడుదలయ్యే నిధులను సిబ్బంది అకౌంట్‌కు జమ చేయాలి. ఈ రెండు సంస్థలు సకాలంలో బిల్లులు పెట్టడం లేదని వైద్యాధికారులు తెలిపారు. వారు బిల్లులు పెట్టకపోతే జీతాల నిధులు ఎలా మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ దేవుడెరుగు! కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఈఎస్ఐ, పీఎఫ్‌లు చెల్లించాలి. వారి పేర్ల మీద అకౌంట్లు తెరచి, సొమ్ములను జమ చేయాలి. ప్రస్తుతం కేజీహెచ్‌లో ఏ కార్మికుడికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కార్మిక శాఖ అధికారులు ఆరా తీసిన దాఖలాలు కూడా లేవు. అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదని కాంట్రాక్ట్ సిబ్బంది వాపోతున్నారు. జీతాలు చెల్లించాలని కోరుతున్నాం కేజీహెచ్‌లో పనిచేస్తున్న నర్సులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. - భాగ్యలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రభుత్వ నర్సుల సంఘం సకాలంలో జీతాలు చెల్లించాలి కేజీహెచ్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించాలి. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం. - శ్రీను, ఐఎన్టీయూసీ నాయకుడు జీతాలు చెల్లిస్తాం కేజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లలు సకాలంలో బిల్లులు పెట్టకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. - డాక్టర్ అర్జున్, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
విరాళాలతో ఇక ‘కింగ్’జార్జి!
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రులకు మహర్దశ పట్టనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు వీలుగా విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. ఓఎన్జీసీ, సెయిల్, రిలయన్స్, విశాఖ స్టీల్ వంటి సంస్థలు ప్రకటించిన విరాళాల మొత్తం ప్రస్తుతం రూ.60 కోట్లు అయింది. ఈ డబ్బుతో రాష్ట్రంలో అత్యంత పురాతన భవన సముదాయాలైన ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్‌జార్జి ఆస్పత్రి భవనాలను పూర్తిగా కూలదోసి, కొత్త వాటిని నిర్మించనున్నారు. కింగ్‌జార్జి ఆస్పత్రిని ఏడు అంతస్తుల్లో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నారు. క్రిటికల్ కేర్, రేడియోథెరపీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. 3వ అంతస్తులో 90 పడకలతో క్యాన్సర్ శస్త్రచికిత్సల విభాగాన్ని, 4వ అంతస్తులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో పాటు అనెస్థీషియా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. 6వ అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి, 7వ అంతస్తులో 300 మంది సామర్థ్యంతో సమావేశ మందిరంతో పాటు నగదు చెల్లించే అతిథుల కోసం ప్రత్యేక గదులు నిర్మించనున్నట్లు ఏపీఎంఎస్ఐడీసీ (మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ)కి చెందిన ఓ అధికారి వివరించారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తు వరకూ రేడియేషన్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్, న్యూక్లియర్ మెడిసిన్ వంటి విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. భవనంపై హెలిప్యాడ్! కింగ్‌జార్జి ఏడు అంతస్తుల ఆస్పత్రి భవనంపై హెలికాప్టర్ దిగేలా హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. నిర్మాణ పనులకు సంబంధించిన నవంబర్‌లోగా టెండర్లను పూర్తిచేసి, డిసెంబర్ చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభించాలని వైద్య విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.60 కోట్ల విరాళాలను వివిధ సంస్థలు ప్రకటించగా, నిర్మాణాల అంచనా రూ.65 కోట్లని తేల్చారు. దీంతో మరో రూ.5 కోట్ల కోసం మరికొన్ని సంస్థలను కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఆపరేషన్ వికటించి మహిళ మృతి
-
ప్రాణమంటే లెక్కలేదా...
కేజీహెచ్‌లో ప్రమాదకరంగా ప్రాణ వాయువు {పమాణాలకు తిలోదకాలు లక్షల విలువైన ఆక్సిజన్ వృథా జనావాసాల మధ్యనే ఫిల్లింగ్ ట్యాంకు {పజలు, రోగులకు ప్రాణ సంకటం కేజీహెచ్ అధికారుల నిర్లిప్తత, కాంట్రాక్టర్ కక్కుర్తి నగరవాసులకు ప్రాణాపాయంగా మారింది. జనావాసాల మధ్య ద్రవ ఆక్సిజన్‌ను నిల్వ చేసే ట్యాంకు ఉండడంతో ఏ క్షణానైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదం సంభవిస్తే కృష్ణానగర్‌లో మూడు నాలుగు కిలో మీటర్ల మేర విధ్వంసం తప్పదు. ప్రాణం పోసే వాయువే(ఆక్సిజన్) ప్రాణం తీసేలా ఉంది. ప్రమాదం పొంచి ఉన్నా జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం, కేజీహెచ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం భయాందోళన రేపుతోంది. విశాఖపట్నం: కింగ్ జార్జ్ హాస్పటల్(కేజీహెచ్)లో ఊపిరి నిలబెట్టే ప్రాణవాయువే మృత్యువుగా మారే ప్రమాదముంది. ఆక్సిజన్ సరఫరాలో స్వలాభం కోసం నాణ్యతకు, రక్షణకు తిలోదకాలిచ్చేయడం కలవరపరుస్తోంది. లోపభూయిష్టంగా తయారైన సరఫరా విధానంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరముంది. కేజీహెచ్‌లో అత్యవసర సేవలకు మెడికల్ ఆక్సిజన్‌ను ఓ కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటున్నారు. ప్రతి రోజూ 7 పీసీసీ(1 కేన్=25 సిలిండర్లు) కేన్లు వినియోగిస్తున్నారు. ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.24.13పైసలు, 5శాతం టాక్స్ చొప్పున(ఒక సిలిండర్=7.1క్యూబిక్ మీటర్లు, ఒక కేన్=220 కేజీలు) ప్రభుత్వం చెల్లిస్తోంది. 2011-12లో రూ.19.50పైసలు ఇచ్చేవారు. అంటే ఏడాదికి రూ.38, 77,55 ఖర్చు చేసేది. 2012-13లో రూ.40 లక్షలు కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఈ కాంట్రాక్టరును వదిలి కొత్త కాంట్రాక్టర్‌కు ఆక్సిజన్ సరఫరా బాధ్యతలు అప్పగించారు. తదుపలి ఏడాది ఖర్చును పెంచి రూ.86.92లక్షలు చెల్లించారు. 2014-15 లో ఇప్పటి వరకూ రూ.71లక్షలు చెల్లించారు. నిజానికి ప్రతి ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆక్సిజన్ చిన్న ట్యాంకు ఉంటుంది. దాని వల్ల ఖర్చు తగ్గుతుంది. అలాంటిది కేజీహెచ్‌లో కనిపించదు. పైపులు, సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కు: కేజీహెచ్ అధికారులు కాంట్రాక్టర్లలో కుమ్మకై లెక్కలు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు ఎన్ని నింపుతున్నారు. సిలిండర్‌ను పూర్తిగా నింపుతున్నారా లేదా అనే దానిని పరీక్షించేందుకు ఎలాంటి శాస్త్రీయ విధానాలను అనుసరించడం లేదు. దీంతో కాంట్రాక్టరు ఎన్ని ఇచ్చామంటే అన్నే లెక్క. జనావాసాల మధ్యనే కాంట్రాక్టరు ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, భారీ ట్యాంకులో ద్రవ ఆక్సిజన్‌ను నిల్వ ఉంచారు. ప్రమాదం జరిగితే కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు వరకూ భారీ ఆస్ధి, ప్రాణ నష్టం వాటిల్లుతుందని తెలిసినా అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. టెస్ట్ చేయించని సిలిండర్లతో ఆక్సిజన్ సరఫరా చేయడం వల్ల రోగి ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. కేజీహెచ్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కడలి సత్యవరప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా దీనికి సంబంధించి తనకేమీ తెలియదని బదులిచ్చారు. ప్రమాణాలకు తిలోదకాలు పీసీసీ కేన్లతో ఆక్సిజన్ సరఫరా చేయడానికి చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్(సీసీఓఇ) అనుమతి(లెసైన్స్) అవసరం. సిలిండర్‌ను ప్రతి ఐదేళ్లకోసారి టెస్ట్ చేయించాలి. సిలిండర్‌కు వేపరైజర్స్ ఉండాలి. కానీ కేజీహెచ్‌కు సరఫరా అవుతున్న ద్రవ ఆక్సిజన్ సిలిండర్లకు ఇవేవీ కనిపించవు. ఆక్సిజన్ సిలిండర్లను ఏడు అత్యవసర విభాగాల్లో ఉంచారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా సిలిండర్ల నుంచి ఆక్సిజన్ భారీగా లీకవుతోంది. ఇది ప్రమాదం. ఆక్సిజన్‌కు మంటలను మండించే గుణం ఉండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉక్కువగా ఉంది. స్టీల్ సిలిండర్లులో ద్రవ ఆక్సిజన్‌ను నింపుతున్నారు. -
పెద్దాస్పత్రికి గుండెకోత
పనిచేయని క్యాథల్యాబ్.. నిలిచిన చికిత్సలు ఫిజిస్ట్ లేక రేడియోథె రపీ బంద్ మూతపడిన థొరాసిక్ సర్జరీ విభాగం రోజువారీ చికిత్సలకు అంతరాయం ఆరోగ్యశ్రీ చికిత్సకు అవరోధం విశాఖ మెడికల్: కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో మూడు కీలక చికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేన్సర్ రోగులకు ఇచ్చే బహిర్గత రేడియేషన్(కోబాల్ట్) థెరపీ 15 రోజులుగా రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్(ఫిజీసిస్ట్) లేక నిలిచిపోయింది. హుద్ హుద్ సమయంలో క్యాథ్ల్యాబ్లోని విలువైన కేబుల్స్ కాలిపోవడంతో పలు హృద్రోగ చికిత్సా ప్రక్రియలకు అవరోధం ఏర్పడింది. మరో పక్క ఐదు నెలలుగా విభాగధిపతి బదిలీ కావడంతో కీలక విభాగమైన గుండె శస్త్ర చికిత్స (కార్డియో థోరసిక్ సర్జరీ)విభాగం మూతపడింది. పెద్దాసుపత్రిలో పేదరోగులకు నాలుగు నెలలుగా గుండె చికిత్సలు.. శస్త్ర చికిత్సలు నిలిచిపోయినా..కేన్సర్ రేడియేషన్ థెరపీకి అంతరాయం వాటిల్లినా.. హుద్ హుద్ అనంతరం మూడు సార్లు కేజీహెచ్‌ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని,మంత్రి గంటా, స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లిలకు పట్టలేదనే విమర్శ వినిపిస్తోంది. కేన్సర్, గుండె సంబంధిత చికిత్సలు అందక పేద రోగులు అప్పులు చేసి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మూడు రకాల చికిత్సలు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ నిధులను రాబట్టుకోలేకపోతోంది. కేన్సర్ రేడియోథెరపీకి అంతరాయం.. కేన్సర్ రేడియోథెరపీ విభాగానికి రోజుకి వంద మంది వరకు వస్తుంటారు. వీరిలో 50 మందికి పైగా రేడియేషన్(కోబాల్ట్)థెరపీ అవసరం పడుతోంది.గర్భాశయ ముఖద్వారం, రొమ్ము, గొంతు, అంగుటి, జీర్ణాశయ, ఉదరకోశ కేన్సర్‌కు సంబంధించి ఎక్కువ మంది వస్తున్నారు. ఒరిస్సా, చత్తీస్ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అంగుటి కేన్సర్ రోగులు ఇక్కడకు వస్తుంటారు. కేన్సర్ కణాల ఉనికిని నాశనం చేసేందుకు రేడియేషన్ థెరపీ ఇస్తారు. దీనిని ఇచ్చేందుకు యంత్ర పరికరాలు, టెక్నిషియన్లు అందుబాటులో ఉన్నా వ్యాధి తీవ్రతను బట్టి రేడియేషన్ మోతాదును నిర్ణయించే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ కమ్ ఫిజిస్ట్ రెండువారాలుగా అందుబాటులో లేరు. వేతనం చాల్లేదన్న నెపంతో ఉద్యోగానికి స్వస్తి పలికినట్లు తెలిసింది. పాత కేన్సర్ రోగులకు గతంలో నిర్ణయించిన మోతాదులతో చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ కొత్త రోగులకు రేడియేషన్ థెరపీ ఇచ్చే పరిస్థితి లేదు . దీంతో కేన్సర్ రేడియేషన్ థెరపీకి అవరోధం ఏర్పడింది. నిలిచిన క్యాథ్‌ల్యాబ్ ప్రక్రియలు.. హుద్ హుద్ ధాటికి షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్డియాలజీ క్యాథ్‌ల్యాబ్ కేబుల్స్ దగ్ధమయ్యాయి. విదేశీ కంపెనీకి చెందిన ఖరీదైన ఈ కేబుల్స్ విలువ రూ.48 లక్షలు కావడం, నిధుల కొరత కారణంతో ఆస్పత్రి వీటిని నాలుగు నెలలు దాటినా ఇంతవరకు సమకూర్చుకోలేకపోయింది. ఫలితంగా కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్ ద్వారా నిర్వహించే కీలకమైన యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టీ, ఫేస్ మేకర్, స్టంట్లు వేసే గుండె చికిత్సా ప్రకియలు నిలిచిపోయాయి. దీనివల్ల అత్యవసర గుండె చికిత్సలకు అవరోధం ఏర్పడింది. సాధారణ చికిత్సలు మాత్రమే కొనసాగుతున్నాయి. షార్ట్‌సర్క్యూట్ వల్ల క్యాథ్‌ల్యాబ్ పనితీరు నిలిచిపోవడంతో కేజీహెచ్‌కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడినట్టయ్యింది. పేద రోగులు గత్యంతరం లేక కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండె చికిత్సా ప్రక్రియలకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద హృద్రోగ చికిత్సలు చేయడానికి వెనుకాడుతుండడంతో పేద రోగుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. కేర్‌కు సిటీ సర్జరీ అప్పగింత.. విభాగధిపతి బదిలీతో మూతపడ్డ కార్డియో థొరసిక్ సర్జరీ విభాగాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)కింద నగరంలోని కేర్ ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు పరస్పరం అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకునేందుకు గురువారం చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలు ఫలప్రదం కావడంతో ఇక మీదట ఆరోగ్యశ్రీ పథకం కింద కేజీహెచ్‌లో గుండె శస్త్ర చికిత్సలను నగరంలోని కేర్ ఆస్పత్రి యాజమాన్యం చేపట్టనుంది. కేజీహెచ్‌లో ఆరు నెలలుగా నిలిచిపోయిన గుండె శస్త్ర చికిత్సలకు మహార్థశ పట్టనుంది. వారం పదిరోజుల్లో క్యాథ్‌ల్యాబ్ రెడీ.. క్యాథల్యాబ్‌లో కాలిపోయిన కేబుల్స్ కొనుగోలుకు కలెక్టర్ ఆమోదంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి రూ.48 లక్షలు విడుదల చేశాం. కొత్త కేబుల్స్‌ను విదేశాల నుంచి రప్పించాం. క్యాథ్‌ల్యాబ్ మరమ్మతు పనులు సాగుతున్నాయి. వారం పది రోజుల్లో క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. మూతపడ్డ కార్డియో థొరసిక్ విభాగాన్ని పీపీపీ కింద కేర్ ఆస్పత్రి యాజమాన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. త్వరలోనే గుండె శస్త్ర చికిత్సలు కూడా ప్రారంభం కానున్నాయి. ఫిజిస్ట్ లేని కారణంగా రేడియేషన్ థెరపీ సేవలకు అంతరాయం వాటిల్లిన విషయం వాస్తవమే. కొత్త ఫిజిస్ట్ను నియమించేందుకు కలెక్టర్ అనుమతిని కోరాం. -డాక్టర్ఎం.మధుసూధనబాబు, పరింటెండెంట్, కేజీహెచ్ -
‘స్వైన్‌ఫ్లూ’ మహమ్మారి
విశాఖలో తొలి కేసు నాలుగేళ్ల బాలుడికి నిర్ధారణ మరో ఇద్దరిలో లక్షణాలు భయాందోళనలో నగర వాసులు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం విశాఖ మెడికల్: విశాఖలో తొలి స్వైన్‌ఫ్లూ కేసు బుధవారం నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో ఒకరు, ఛాతి ఆస్పత్రిలో మరొకరు చికిత్సపొందుతున్నారు. దీంతో విశాఖలో కలవరం రేగింది. మాస్కులు లేకుండా ఆరుబయటకు జనం రావడానికి సాహసించలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కూడా మాస్కులు ధరించి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం ఇసుక తోటలో ఓ ప్రై వేట్ ఆస్పత్రికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులకు అనుమానం రావడంతో మెరుగైన వైద్యం కోసం కింగ్ జార్జ్ హాస్పటల్(కేజీహెచ్)కు పంపించారు. అక్కడి పిల్లల ఐసొలేషన్ వార్డులో బాలుడిని ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లాలాజలం నమూనాలను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపిఎం) ల్యాబ్‌కు పంపించారు. బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు ల్యాబ్ నుంచి బుధవారం సాయంత్రం ఆన్లైన్లో సమాచారం అందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సరోజిని వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల లాలా జలాజలతో పాటు బాలుడికి వైద్య సేవలందించిన వైద్యుల లాలాజలాల నమూనాలను ముందు జాగ్రత్త చర్యగా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఐదు రోజుల క్రితం గాజువాక ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో పరీక్షలు జరిపగా కాదని తేలింది. అనంతరం బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పొర్లుపాలెంకు చెందిన 37ఏళ్ల మహిళ మర్రిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వైన్ ప్లూ అనుమానిత లక్షణాలతో మరణించింది. ఆమెకు స్వైన్‌ప్లూ లేదని పరీక్షల్లో తేలింది. ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెకు కూడా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసి సాధారణ అనారోగ్యమేనని నిర్ధారించారు. పలాసకు చెందిన 55 ఏళ్ల వృద్ధుడు జ్వరం, దగ్గు, న్యూమోనియా లక్షణాలతో ఛాతి ఆస్పత్రిని ఆశ్రయించాడు. అతనిని పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుగా భావించి స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. పెదవాల్తేర్ ఆదర్శ్‌నగర్‌కు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఇటీవల తల్లిదండ్రులతో శబరిమలై వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఒకట్రెండు రోజులు హైదరాబాద్‌లో గడిపి విశాఖ వచ్చాడు. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ తీవ్రత అధికంగా ఉండడం, అదే లక్షణాలు బాలుడిలో కన్పించడంతో బుధవారం మధ్యాహ్నాం కేజీహెచ్‌ను ఆశ్రయించాడు. బాలుడిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలు గుర్తించి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఈ ఇద్దరి లాలా జలాలను పరీక్షలకు పంపించారు. నివేదికలు రావాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకూ జిల్లాలో 7 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదు కాగా ఒకరికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఐదేళ్లలో 13 మంది దుర్మరణం: 2009 నుంచి జిల్లాలో 60 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదు కాగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 2009లో 29 కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. 2010లో 16 కేసులు నమోదుకాగా, నలుగురు చనిపోయారు. 2011లో ఒక్క కేసునమోదుకాలేదు. 2012లో 8కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. 2013లో మూడు కేసులు నమోదయ్యాయి.2014లో నాలుగు కేసులు నమోదు కాగా ఇద్దరు చని పోయారు. అప్రమత్తమైన అధికారులు: స్వైన్‌ఫ్లూ నమోదుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేజీహెచ్‌తో పాటు అన్ని రిఫరల్ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యులను అప్రమత్తం చేశారు. స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రకటించారు. 800 కేసులకు వైద్యానికి మందులు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ తనిఖీ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు డిఎంహెచ్ఓ సరోజిని తెలిపారు. -
వెలుగు నీడలు
VIP రిపోర్టర్ గుండె జబ్బులోళ్లను బాగా సూత్తన్నారు {పసూతి వార్డులో బెడ్స్ సరిపోడం లేదు బాత్రూమ్లు శుభ్రంగా ఉండాలి పెద్దాస్పత్రి.. 1823లో చిన్న ఆస్పత్రిగా ప్రారంభమై 1923లో కింగ్ జార్జ్ హాస్పటల్‌గా అవతరించింది. 25 విభాగాల్లో వందలాది మంది వైద్య సిబ్బందితో ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. ప్రతి రోజు సగటున రెండు వేలమంది చికిత్స పొందే ఈ వైద్యాలయంలో అనేక సదుపాయాలున్నాయి. రోగులకు సాంత్వన అందించాలన్న సేవాభావముంది. వీటితోపాటు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే కింగ్‌జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదనబాబు ‘సాక్షి’ తరపున ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో కలియతిరుగుతూ రోగులు, వైద్యులు, సిబ్బందిని పలకరించారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని మెరుగైన వైద్య సేవలు కల్పిస్తామని రోగులకు భరోసా ఇచ్చారు. కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందించడంతోపాటు వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంది. మొత్తానికి 1100 మంది నర్సులు అవసరం కాగా కేవలం 204మందే ఉన్నారు. ప్రసూతి వార్డుల్లో సరిపడా పడకలు లేవు. దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నాం. మిగతా వార్డుల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే మరిన్ని సదుపాయాలు కల్పించడానికి, కొత్త భవనాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం. -డాక్టర్ ఎం.మధుసూదనబాబు, సూపరింటెండెంట్, కింగ్‌జార్జ్ హాస్పటల్ -
గాంధీ, కింగ్‌జార్జి ఆస్పత్రుల్లో ఎబోలాకు చికిత్స
ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులను కేంద్రం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రిని, తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని ఈ వ్యాధి చికిత్స కోసం గుర్తించినట్టు తెలిపింది. రాజ్యసభలో ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సంగతి తెలిపారు. -
విశాఖ కెజిహెచ్లో హౌస్ సర్జన్ల ఆందోళన
-
కేజీహెచ్‌లో మహిళ మృతి: బంధువుల ఆందోళన
విశాఖపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో యువతిని ఆమె బంధువులు మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... విశాఖ జిల్లా పద్మనాభపురం మండలం రేవిడి ఆసుపత్రిలో ఓ యువతి ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత ఆ యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆ యువతి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. -
పసికందు అపహరణ కేసు ఛేదించిన పోలీసులు
విశాఖపట్నం కింగ్ జార్జీ ఆసుపత్రిలో ఇటీవల పసికందును అపహరించిన కేసును నగర పోలీసులు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు, ఇద్దరు మహిళ ఉద్యోగులతోపాటు అపహరించిన పసికందును కొనుగోలు చేసిన రాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. పసికందు అపహరణపై కింగ్ జార్జీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే అత్యంత వేగంగా ఆ కేసును ఛేదించిన సిబ్బందికి నగర వన్‌టౌన్ సీఐ మహ్మద్ రూ. 10 వేలు రివార్డు అందజేశారు. -
'రైల్వే ఆసుపత్రి నుంచి మృతదేహలను కేజీహెచ్‌కు తరలించండి'
గొట్లం రైలు ప్రమాద ఘటనలో మరణించిన ఎనిమిది మృతదేహలను రైల్వే ఆసుపత్రి నుంచి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర మంత్రి పి.బాలరాజు ఉన్నతాధికారులను ఆదివారం ఆదేశించారు. నిన్న రాత్రి విజయనగరం సమీపంలోని గొట్లంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన మృతదేహలను ఆదివారం గుర్తించారు. అనంతరం ఆ మృతదేహలను విశాఖలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రిలో ఫ్రీజింగ్ బాక్స్‌లు లేకపోవడం పట్ల మంత్రి బాలరాజు విస్మయం వక్యం చేశారు. దాంతో బాలరాజు వెంటనే స్పందించి పైవిధంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయనగరం సమీపంలోని గొట్లంలో నిన్న రాత్రి జరిగిన రైల్వే ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరోకరిని గుర్తించవలసి ఉంది. అయితే మృతుల్లో ఒక్కరే రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన ఇద్దరు క్షతగాత్రులు విశాఖపట్నంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
కేజీహెచ్ వైద్యులు ఇద్దరు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎట్టిపరిస్థితుల్లో విభజించవద్దని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వారిద్దరు కేజీహెచ్ భవనం పైకెక్కారు. సమైక్యంగా ఉంచేంతవరకు తాము కిందకు దిగమని వారు స్పష్టం చేశారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిపైకి ఎక్కిన వైద్యులను పోలీసులు బుజ్జగించి కిందకి దింపారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.