ఆర్టీసీ బస్‌ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

Software employee dies at Banjarahills road accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ పెన్షన్‌ ఆఫీస్‌ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని (25) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు స్పిన్స్‌సై సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగిని శిరీషగా గుర్తించారు. ఆమెకు ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌ నుంచి కార్యాలయానికి వెళ్లే సమయంలో శిరీష రోడ్డు ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to Top