రంగారెడ్డిజిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తం | snake gang family members hulchul in rangareddy court | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిజిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తం

May 11 2016 3:22 PM | Updated on Aug 20 2018 7:28 PM

రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్నేక్ గ్యాంగ్ సభ్యులకు శిక్షలు ఖరారు చేస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం గ్యాంగ్ కుటుంబసభ్యులు హల్‌చల్ చేశారు.

కోర్టు హాలు బయటకు వచ్చిన సీపీ ఆనంద్‌ను గ్యాంగ్ కుటుంబసభ్యులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. 8 మంది నిందితుల్లో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఏ8 నిందితుడు అలీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement