ఒకే కొమ్మకు.. రెండు రంగుల పూలు.. | Single stalk .. two flowers | Sakshi
Sakshi News home page

ఒకే కొమ్మకు.. రెండు రంగుల పూలు..

May 30 2018 1:49 PM | Updated on May 30 2018 1:49 PM

Single stalk .. two flowers - Sakshi

అందరినీ ఆకట్టుకుంటున్న మందార పూలు  

పాల్వంచరూరల్‌ : ఒకే చెట్టుకు రెండు రకాల మందారపూలు పూస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామపంచాయతీ లక్ష్మిదేవిపల్లిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తన ఇంట్లో నాలుగేళ్లుగా పసుపు రకం మందార చెట్టును పెంచుతున్నాడు.

ప్రతి సంవత్సరం ఈ చెట్టుకు పసుపు రంగు పూలు మాత్రమే పూసేవి. కానీ.. ఇటీవల అదే చెట్టుకు ఎర్ర మందారాలు కూడా పూస్తున్నాయి. ఒకే కొమ్మకు పక్కపక్కనే రెండు రంగుల పూలు పూయడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement