అందానికి మందార.. | Hibiscus Face Pack Benefits for Glowing Skin | Natural Beauty Tips for Women | Sakshi
Sakshi News home page

సహజసిద్ధమైన అందానికి మందార మంత్ర..! ఇలా ఉపయోగిస్తే..

Oct 24 2025 9:54 AM | Updated on Oct 24 2025 11:20 AM

beauty Tips: Unlocking the Secrets of Hibiscus for Skin

మందార పూలను చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా... అలాంటి అందమైన మందార సౌందర్య సాధనలో మహిళలకు ఎంతో తోడ్పడుతుంది. అందుకు చేయాల్సిందల్లా మందార పూల పొడిని తయారు చేసి ఫేస్‌ ప్యాక్‌ లేదా మాస్క్‌గా ఉపయోగించడమే. 

రెండు టేబుల్‌ స్పూన్ల మందార పొడి, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టీస్పూన్‌ తేనె కలిపి మొత్తటి పేస్ట్‌ తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15–20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మిలమిలలాడే సౌందర్యం మీ సొంతమవుతుంది. 

ఎందుకంటే మందారలో ఉండే సహజమైన మ్యూసిలేజ్‌ సమ్మేళనాలు తేమను నిలుపుకోవడంలో తోడ్పడతాయి. అంతేకాదు, మందారలోని నేచురల్‌ ఆస్ట్రింజెంట్లు తైల స్రావాన్ని నియంత్రించడంలో, మొటిమలను తగ్గించడంలో సహాయపడటమేగాక ఇవి అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. సహజంగా వచ్చే చర్మం ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. 

(చదవండి: ఆపరేషన్‌ మధ్యలో క్లారినెట్‌ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement