పట్టుదలే పెట్టుబడి | si job results | Sakshi
Sakshi News home page

పట్టుదలే పెట్టుబడి

May 11 2014 3:09 AM | Updated on Mar 19 2019 5:52 PM

మండలం నుంచి ముగ్గురు యువకులు ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు.

 ఎస్‌ఐ ఉద్యోగమంటే ఎంతో ‘ఖర్చు’ అనుకునే ఈ రోజుల్లో చాలా అవలీలగా ఉద్యోగం సంపాదించి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు పాలమూరు ముద్దు బిడ్డలు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినా పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగారు. లక్ష్య సాధనలో అనేక అవరోధాలు ఎదురైనా అన్నింటినీ అధిగమిస్తూ గమ్యం చేరుకున్నారు. శనివారం వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో పాలమూరు పేద విద్యార్థులు ప్రతిభ చూపారు.
 
  పేద కుటుంబాల నుంచి...
 
 కొల్లాపూర్ నుంచి ముగ్గురు యువకుల ఎంపిక

 కొల్లాపూర్‌రూరల్,న్యూస్‌లైన్ : మండలం నుంచి ముగ్గురు యువకులు ఎ స్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు. శని వారం రాష్ట్రపోలీస్ శాఖ విడుదల చేసిన ఎస్‌ఐ ఫలితాల్లో  చుక్కాయిపల్లి,రామాపురం, సింగోటం గ్రామాలకు చెందిన  ముగ్గురు యువకులు తమ ప్రతిభ కనబర్చి ఎస్ ఐలుగా ఎంపికయ్యారు. చుక్కాయిపల్లికి చెందిన వరప్రసాద్ జనరల్ కేటగిరిలో 172మార్కులు సాధించి సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. సింగోటంకు చెందిన ధర్మేష్, రా మాపురానికి చెందిన నాగరాజులు ఎస్‌ఐ పోస్టుకు ఎంపికైన ట్లు గ్రామస్తులు తెలిపారు. చుక్కాయిపల్లికి చెందిన వరప్రసాద్ వనపర్తి ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఐ పోస్టుకు ఎంపిక కావడంతో గ్రామస్తులతో పాటు స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు.
 
 ఉప్పునుంతల, న్యూస్‌లైన్ : ఉప్పునుంతలకు చెందిన అంతటిలోని ఓ అనే యువకుడు ఎస్‌ఐగా  ఎంపికయ్యాడు. గత మార్చిలో రాజేష్‌గౌడ్ వీఆర్‌ఓగా ఎంపికవడంతో ప్రస్తుతం అచ్చంపేటలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇతను 10వ తరగతి వరకు ఉప్పునుంతల పాఠశాలలో చదివాడు. ఇంటర్ అచ్చంపేటలోని ప్రగతి కళాశాలలో, డిగ్రీ సీబీఎం కళాశాల కల్వకుర్తిలో, ఎంబీఏ హైదరాబాద్‌లోని టీకేఆర్ కళాశాలలో పూర్తిచేశాడు. 2012లో పట్టుదలతో సన్నద్దమై ఎస్‌ఐ ఎంపిక పరీక్ష రాసి ఎంపికయ్యాడు. దీంతో గ్రామస్తులు పలువురు రాజేష్‌గౌడ్‌ను అభినందించారు.
 
 మరో ఇద్దరు కానిస్టేబుళ్లు..

 ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న సైదులు, వెంకటేష్‌లు కూడా ఎస్‌ఐకి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సైదులు వెల్దండ మండలం చంద్రాయణపల్లికి చెందిన వ్యక్తి కాగా, వెంకటేష్ మిడ్జిల్ మండలం రామిరెడ్డిపల్లి నివాసి. ఇరువురు యువకులు 2013లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ఇక్కడకు వచ్చారని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 2014 బ్యాచ్‌లో ఇద్దరూ ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఎస్‌ఐ వారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement