ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి | Should replace the empty posts | Sakshi
Sakshi News home page

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

Oct 21 2014 12:53 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి - Sakshi

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసి, పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ నేత,

హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసి, పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఓయూలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జే ఏసీ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని, ఖా ళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్లతో చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఓయూ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చాలన్నారు. ఉద్యోగాల కోసం ఓయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన, ఉద్యోగాల భర్తీ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనునట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నరేందర్‌రెడ్డి, కిరణ్‌గౌడ్, వీరబాబు, మానవతారాయ్, కల్యాణ్, సోలంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement