అవ్వాతాతల పెళ్లి సందడి! | Shastipuri celebrations in vikarabad | Sakshi
Sakshi News home page

అవ్వాతాతల పెళ్లి సందడి!

Aug 7 2017 2:25 AM | Updated on Sep 17 2017 5:14 PM

అవ్వాతాతల పెళ్లి సందడి!

అవ్వాతాతల పెళ్లి సందడి!

అవ్వాతాతలకు బాసింగాలు కట్టారు. నూతన వధూవరుల మాదిరిగా అలంకరించారు. కొడుకులు, కోడళ్లు, మనుమరాళ్ల సమక్షంలో దండలు మార్చుకున్నారు.

తాండూరు: అవ్వాతాతలకు బాసింగాలు కట్టారు. నూతన వధూవరుల మాదిరిగా అలంకరించారు. కొడుకులు, కోడళ్లు, మనుమరాళ్ల సమక్షంలో దండలు మార్చుకున్నారు. అచ్చం పెళ్లి సందడిలా జరిగిన ఈ కార్యక్రమం ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో జరిగింది. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన భీమరథశాంతి (షష్టిపూర్తి మాదిరి కార్యక్రమం) ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తాండూరుకు చెందిన 45 మంది వృద్ధ దంపతులకు భీమరథశాంతి నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు సత్యసాయి సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో మందికి మేలు చేకూరుతుందని ప్రశంసించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement