షాద్‌నగర్‌ ఘటనలో బాధితురాలి పేరు మార్పు | Shadnagar Victim Name Changed As Justice For Disha | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌ ఘటనలో బాధితురాలి పేరు మార్పు

Dec 1 2019 8:41 PM | Updated on Dec 1 2019 9:26 PM

Shadnagar Victim Name Changed As Justice For Disha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలి పేరును మార్చినట్టు పోలీసులు తెలిపారు. ఇకపై బాధితురాలిని ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ పేరుతో పిలవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను సజ్జనార్‌ ఒప్పించారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దని కోరారు. జస్టిస్‌ ఫర్‌ దిశకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా నిర్భయ, అభయ కేసుల్లో సైతం బాధితురాలి అసలు పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు బాధితురాలి పేరును మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement