అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

Shadnagar Municipal Voter List as full of Mistakes - Sakshi

తప్పుల తడకలా షాద్‌నగర్‌ మున్సిపల్‌ ఓటరు జాబితా  

షాద్‌నగర్‌టౌన్‌: అధికారుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకలా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఇంటి నంబర్‌ 18–211/6లో ఓటరు పేరు డ డ అని, తండ్రి పేరు హ హ.. అని నమోదు చేశారు. ఇంటి నంబర్‌ 18–403/5లో ఓటరు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తండ్రి పేరు బదులుగా ఆయన భార్య పేరును నమోదు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని పరిశీలిస్తోన్న ప్రజలు ఈ తప్పుల తడకలా తయారైన ఓటర్ల జాబితాను చూసి అవాక్కవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top