లారీ, బస్సు ఢీ: ఏడుగురికి గాయాలు | seven injured of lorry and bus accident | Sakshi
Sakshi News home page

లారీ, బస్సు ఢీ: ఏడుగురికి గాయాలు

Jun 29 2015 9:30 AM | Updated on Sep 3 2017 4:35 AM

వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

మహబూబ్‌ నగర్: వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం పరిధిపురం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. రాయ్‌చూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు గ్రామ శివారులో ఆగి ఉన్న సమయంలో కర్నూలు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ రెండుకాళ్లు విరగడంతో పాటు.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement