భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం | security lapses in railways, rs 2.45 crores lost | Sakshi
Sakshi News home page

భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం

Published Fri, Dec 19 2014 4:15 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం - Sakshi

భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లాలో ఈ ఏడాది నవంబర్ నాటికి రైళ్లు, పట్టాలపైన జరిగిన దొంగతనాల్లో రూ. 2కోట్ల 45 లక్షల ఆస్తి చోరుల పాలైంది.

  • రైళ్లలో పెరిగిన చోరీలు.. పట్టుబడని దొంగలు
  • సికింద్రాబాద్ పరిధిలో చోరీల విలువ రూ.2.45 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లాలో ఈ  ఏడాది నవంబర్ నాటికి రైళ్లు, పట్టాలపైన జరిగిన  దొంగతనాల్లో రూ. 2కోట్ల 45 లక్షల ఆస్తి చోరుల పాలైంది. గత సంవత్సరంతో  పోలిస్తే ఈసారి చోరీ విలువ మరో 20 లక్షలు పెరిగింది.  ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు గుంతకల్, విజయవాడ రైల్వే ఎస్పీ జిల్లాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లా పరిధి మిగిలింది.

    దీనికింద  మొత్తం మూడు సబ్ డివిజన్లు సికింద్రాబాద్ అర్బన్, సికింద్రాబాద్ రూరల్, కాజీపేట్‌లున్నాయి. గత జనవరి నుంచి  నవంబర్ వరకు నడుస్తున్న ైరైళ్లలోకి ప్రవేశించి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను తెంచుకుపోవడం, నిద్రలో ఉన్న ప్రయాణికుల లగేజ్‌ను ఎత్తుకుపోవడం  వంటివి అనేకం జరిగాయి.

    గత 11 నెలల్లో  రైళ్లలో 695 చోరీలతోపాటు మొత్తం 777 కేసులు నమోదయ్యా యి. ఈ కేసుల్లో అపహరణకు గురైన సొత్తు విలువ రూ.2.45 కోట్లని పోలీసులు తేల్చా రు.  కాగా  పలువురు దొంగలను పట్టుకున్నప్పటికీ వారి నుంచి స్వాధీనం చేసుకుంది రూ.42 లక్షల 6 వేలే. కాగా నింది తుల కోసం ప్రత్యేకబృందాలతో గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement