స్కూల్ బస్సు బోల్తా | School bus accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా

Jul 25 2015 12:33 AM | Updated on Sep 15 2018 4:05 PM

స్కూల్ బస్సు బోల్తా - Sakshi

స్కూల్ బస్సు బోల్తా

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు పిల్లల ప్రాణాల మీదికి వస్తుంది...

40మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
షాద్‌నగర్:
ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు పిల్లల ప్రాణాల మీదికి వస్తుంది. షాద్‌నగర్ మండలంలోని ఎల్లంపల్లి శివారులో ఓ స్కూల్ బస్సు బోల్తా పడటంతో దాదాపు 40మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం... ఎలికట్టలో ఉన్న నేతాజీ పాఠశాలకు చెందిన బస్సు ప్రతిరోజూ లాగే శుక్రవారం లాలాపేట, కందివనం, ఎల్లంపల్లిలో 50మంది విద్యార్థులకు ఎక్కించుకుని స్కూల్ బయల్దేరింది. బస్సు టైర్లు సరిగా లేకపోవడంతో ఎల్లంపల్లి శివారులో బోల్తా పడింది.

వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగలకొట్టి విద్యార్థులను బయటకు తీశారు. 40మంది విద్యార్థుల తలకు, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. 108వాహనంలో గాయపడిన విద్యార్థులను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బస్సు టైర్లు సరిగా లేవని, ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే బోల్తా పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. కొందర్గు ఎస్‌ఐ మధుసూదన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement