నేడు సర్కార్‌ ఇఫ్తార్‌

Sarkar Iftar today - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదుల్లో విందు

నాలుగు లక్షల మందికి డిన్నర్‌ ఏర్పాట్లు

ఎల్బీ స్టేడియంలో మెగా ఇఫ్తార్‌.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోద రులకు శుక్రవారం దావత్‌–ఏ–ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది. ఉపవాస దీక్ష విరమించే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదుల్లో సుమారు 4 లక్షల మందికి ఇఫ్తార్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 400 మసీదులు, జిల్లాల పరిధిలో 400 మసీదుల్లో కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గానికి నాలుగు మసీదుల చొప్పున ప్రతీ మసీదు కమిటీ ఆధ్వర్యంలో కనీసం 500 మందికి తగ్గకుండా పండ్లు, బిర్యానీ, స్వీట్లు సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. దీని కోసం మసీదుకు రూ.లక్ష చొప్పున సుమారు రూ.8 కోట్లను ఆన్‌లైన్‌ ద్వారా కమిటీలకు అందజేశారు.

హైదరాబాద్‌లో మెగా ఇఫ్తార్‌..
ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లిం సోదరు లకు మెగా ఇఫ్తార్‌ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలతో పాటు వివిధ దేశాలకు చెందిన రాయబారులు కూడా పాల్గొన నున్నారు. ఇక్కడ దాదాపు 8 వేల మందికి ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లు చేశారు.

రంజాన్‌ కానుకగా కొత్త బట్టలు..
ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేస్తోంది. 800 మసీదు కమిటీలకు వీటి పంపిణీ బాధ్యతలు అప్పగించింది. ప్రతీ మసీదు పరిధిలో 500 చొప్పున పేద కుటుంబాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త బట్టలు ఉండే ప్యాకెట్లను అందజేస్తారు. ఒక్కొక్క ప్యాకెట్‌లో రూ.525 విలువగల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్‌ ఉండనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top