సమత కేసు: కోర్టుకు ఏడుగురు సాక్ష్యులు

Samatha case: Witnesses attend Fast track court - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ : జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ  ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసు విచారణలో భాగంగా ఏడుగురు సాక్షులు సోమవారం ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు హాజరు అయ్యారు. సెలవు దినాలు తప్ప ఈ నెల 31 వరకూ రోజుకు ఏడుగురు సాక్ష్యులను న్యాయస్థానం విచారణ చేయనుంది. సాక్ష్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు అనంతరం, పోలీసులు సేకరించిన ఆధారాలు, ఎఫ్‌ఎస్‌ఎల్‌, డీఎన్‌ఏ నివేదికలు పరిశీలించిన తర్వాత జనవరి మొదటివారంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా గత నెల 24న దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.

చదవండి: 

సమతహత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు

'సమత' పిల్లలకు ఉచిత విద్య

సమతగా పేరు మార్పు: ఎస్ప

దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top