నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | RTC Bus overturns in kagna river | Sakshi
Sakshi News home page

నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Jun 26 2015 9:19 AM | Updated on Mar 28 2018 11:08 AM

రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని కాగ్నా నదిలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు శివారులోని కాగ్నా నదిలోకి శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రెండు రోజుల క్రితం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో బ్రేకులు ఫెయిల్ అయి.. నిలిచిపోయింది. 

సదరు బస్సును బాగు చేయడానికి ఈ రోజు తెల్లవారుజామున తాండూరు డిపోకు తరలిస్తున్న క్రమంలో బ్రిడ్జ్పై నుంచి కాగ్నా నదిలోకి దూసుకెళ్లింది. అయితే బస్సు వెనుక భాగం మాత్రం బ్రిడ్జ్పైనే ఉండిపోయింది. దాంతో బస్సు డ్రైవర్ బస్సులో నుంచి కిందకి దూకేశాడు. బస్సుని నదిలో నుంచి బయటకు తీసేందుకు ఆర్టీసీ అధికారులు స్థానికుల సహాయంతో చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement