ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రయాణికులు పరుగులు | RTC bus catches fire in warangal district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రయాణికులు పరుగులు

May 17 2014 1:51 PM | Updated on Sep 2 2017 7:28 AM

వరంగల్ జిల్లాలో బస్సు ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది.

వరంగల్ జిల్లాలో బస్సు ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా చింతల్ బ్రిడ్జి వద్ద శనివారం ఆర్టీసీ బస్సులో మంటలు అకస్మాత్తుగా ఎగసిపడ్డాయి. దాంతో బస్సులోని ప్రయాణికులు భయంతో బస్సు నుంచి బయటకు దూకి పరుగులు తీశారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

 

అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ మంటలలో ప్రయాణికుల లగేజీ పూర్తిగా ఆహుతి అయింది. బస్సులో మంటలకు గల కారణాలపై పోలీసులు డ్రైవర్, ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement