ఆర్టీసీ కార్యాలయంలో మసాజ్‌ సేవలు | RTA Officer Massage Services From Staff In Uppal Hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్యాలయంలో మసాజ్‌ సేవలు

Aug 4 2018 11:02 AM | Updated on Sep 4 2018 5:53 PM

RTA Officer Massage Services From Staff In Uppal Hyderabad - Sakshi

మసాజ్‌ చేయించుకుంటున్న అధికారి

ఉప్పల్‌: ఉప్పల్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి కింది స్థాయి సిబ్బందితో మసాజ్‌ చేయించుకుంటూ బహిరంగంగా దొరికిపోయా డు. లైసెన్స్‌ల కోసం కార్యాలయానికి వచ్చిన వారు దీనిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్‌ ఆర్టీఏ కార్యాలయంలో మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)గా పనిస్తున్న సురేష్‌రెడ్డి తన సీట్‌లోనే కూర్చుని బనియన్‌పై కిందిస్థాయి సిబ్బందితో మసాజ్‌ చేయించుకుంటుండటాన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు ఫొటోలు తీసి  సోషల్‌ మీడియాలో ఉంచారు.

తప్పుగా అర్థం చేసుకోవద్దు : సురేష్‌రెడ్డి
గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నా. శుక్రవారం పని ఒత్తిడితో నొప్పి తీవ్రతరం కావడంతో గార్డెన్‌లో పనిచేసే వ్యక్తికి ఫిజియోథెరపీ తెలుసని చెప్పడంతో డ్యూటీ ముగిసిన తర్వాత మెడనరం వదిలించడానికి మెల్లగా నొక్కాడు. దయచేసి దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉద్యోగితో మసాజ్‌ చేసుకునే తత్వంకాదు.

Advertisement
 
Advertisement
Advertisement