రుణమాఫీకి రూ.2,190 కోట్లు | Rs .2,190 crore loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి రూ.2,190 కోట్లు

Jun 26 2016 12:27 AM | Updated on Sep 4 2017 3:23 AM

వ్యవసాయ రుణ మాఫీ పథకం కింద మూడో విడతగా రూ.2,190 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ

హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీ పథకం కింద మూడో విడతగా రూ.2,190 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత కింద రూ.4,380 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. అందులో సగం నిధులను తాజాగా విడుదల చేసింది.


దీంతో ఇప్పటి వరకు విడుదలైన మొత్తం నిధులు రూ.10,626 కోట్లకు చేరాయి. ఈ పథకంలో భాగంగా గతంలో 2014 సెప్టెంబర్ 23న రూ.4,250 కోట్లు, 2015 జూన్ 20న రూ.2,043 కోట్లు, 2015 జూలై 31న రూ.2,043 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement