మైనార్టీ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు | Rs 1.37 crore funds released for Minority commission | Sakshi
Sakshi News home page

మైనార్టీ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు

Apr 16 2015 7:53 PM | Updated on Sep 3 2017 12:23 AM

రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.37 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ తెలిపారు.

హైదరాబాద్ సిటీ: రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.37 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.70.39 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.67.08 లక్షలు బడ్జెట్‌లో కేటాయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రాలు కేటాయించిన నిధులతో కమిషన్ కార్యాకలాపాలు నిర్వహణకు వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement