‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు సిటీ వనిత | Rohini Naidu Enter Final in Misses Universe | Sakshi
Sakshi News home page

‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు సిటీ వనిత

May 22 2019 8:12 AM | Updated on May 22 2019 8:12 AM

Rohini Naidu Enter Final in Misses Universe - Sakshi

రోహిణి నాయుడు

పంజగుట్ట: నగరానికి చెందిన రోహిణి నాయుడు ‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనతను సాధించినఏకైక మహిళగా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో గ్రీస్‌ దేశంలో జరిగే పోటీల్లో టైటిల్‌ పోరులో తలపడనున్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిణి మాట్లాడారు. మిస్సెస్‌ యూనివర్స్‌ పోటీలకు వివిధ దేశాల నుంచి 30 వేల ఎంట్రీలు రాగా 172 మందిని ఫైనల్స్‌కు ఎంపికచేశారన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తాను ఒక్కదాన్నేఎంపికైనందుకు గర్వంగా ఉందన్నారు. ఫైనల్స్‌లో సత్తా చాటి నగరానికి టైటిల్‌ తీసుకుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోటీల్లో భాగంగా మహిళా సాధికారత, జెండర్‌ ఈక్వాలిటీ, అపోహలు తొలగించడం అనే అంశాలపై టాస్క్‌లు చేసి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement