గౌతమినగర్‌లో భారీ చోరీ | Robbery in Gowthami Nagar | Sakshi
Sakshi News home page

గౌతమినగర్‌లో భారీ చోరీ

Jan 8 2016 6:27 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గౌతమినగర్‌లో భారీ చోరీ జరిగింది. భారజల కర్మాగారంలో సైంటిఫిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుందర్‌లాల్ మూడు రోజుల క్రితం తమ కుమారుడిని హైదరాబాద్‌లో దిగబెట్టి వచ్చేందుకు వెళ్లారు.

అశ్వాపురం : ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గౌతమినగర్‌లో భారీ చోరీ జరిగింది. భారజల కర్మాగారంలో సైంటిఫిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుందర్‌లాల్ మూడు రోజుల క్రితం తమ కుమారుడిని హైదరాబాద్‌లో దిగబెట్టి వచ్చేందుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి రాగా.. తలుపుల తాళాలు, లోపల బీరువా బద్దలు కొట్టి వస్తువులు చిందరవందరగా కనిపించాయి. ఇంట్లో ఉంచిన 48 తులాల బంగారు ఆభరణాలు, రూ.60వేల నగదు చోరీకి గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement