పెళ్లింట్లో చోరీ.. | Robbery at Bride home | Sakshi
Sakshi News home page

పెళ్లింట్లో చోరీ..

Mar 21 2017 12:17 PM | Updated on Aug 30 2018 5:27 PM

పెళ్లింట్లో చోరీ.. - Sakshi

పెళ్లింట్లో చోరీ..

వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు.

జగిత్యాల: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలోని మార్కెట్‌రోడ్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ఓ ఇంట్లో త్వరలో పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పత్రికలు పంచడానికి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు.
 
ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదుతో పాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనంత్‌ శర్మ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement