ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
జైపూర్: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జైపూర్ మండలంలోని సింగరేణి పవర్ ప్లాంట్ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రావుల దుర్గయ్య(43) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. జైపూర్ నుంచి నర్సింగాపూర్‌కు బైక్ మీద వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.