టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ | Road Accident At Mancherial District | Sakshi
Sakshi News home page

టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ

Jun 8 2020 5:33 AM | Updated on Jun 8 2020 5:33 AM

Road Accident At Mancherial District - Sakshi

దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కన్నెపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యా యి. లక్సెట్టిపేట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్‌ నుంచి కామారెడ్డికి ఇసుకలోడ్‌తో వెళ్తున్న టిప్పర్, హైదరాబాద్‌ నుంచి ఊట్నూర్‌కు 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొని బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ రవి (35) మృతి చెందగా, బస్సు డ్రైవర్‌ తిరుపతి, బస్సులో ప్రయాణిస్తున్న యశోద, త్రివేణి, శశికుమార్, ఉపేందర్‌తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్సులో లక్సెట్టిపేట, మంచిర్యాల ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో టిప్పర్‌ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్‌ రవి క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతన్ని బయటకు తీశారు. తీవ్ర గాయాలైన రవిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. టిప్పర్‌ డ్రైవర్‌ రవిని కామారెడ్డి జిల్లా యాచారం నివాసిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement