పోలీస్ అమర వీరులకు పిండప్రదానం | rice offering to police martyrs | Sakshi
Sakshi News home page

పోలీస్ అమర వీరులకు పిండప్రదానం

Jul 24 2015 10:23 PM | Updated on Aug 21 2018 7:46 PM

సిమీ తీవ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన పోలీస్‌అమర వీరులకు నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం భద్రాచలంలో పిండప్రదానం చేశారు.

భద్రాచలం: సిమీ తీవ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన పోలీస్‌అమర వీరులకు నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం భద్రాచలంలో పిండప్రదానం చేశారు. నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 7న సిమీ తీవ్రవాదులకు, పోలీసులకు జరిగిన పోరులో ఎస్‌ఐ సిద్దయ్య, కానిస్టేబుల్‌లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు రమేష్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు నల్లగొండ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు మండవ హుస్సేన్‌గౌడ్, హెడ్‌కానిస్టేబుల్ రెండపోగు వెంకటేశ్వర్లు, దాడి ఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్‌లు మధు, నాగరాజులు పిండప్రధానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement