తెలంగాణ రాష్ట్రం నచ్చింది | Reverend Bishop Joseph Copacz says that he likes Telangana people | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రం నచ్చింది

Feb 11 2019 2:44 AM | Updated on Apr 4 2019 3:25 PM

Reverend Bishop Joseph Copacz says that he likes Telangana people - Sakshi

సభలో మాట్లాడుతున్న బిషప్‌ జోసెఫ్‌ కోపాజ్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : ‘తెలంగాణ ప్రజలు బాగుండాలి.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిఒక్కరూ సుభిక్షంగా ఉండేందుకు లోక రక్షకుడైన ఏసుక్రీస్తును ప్రార్థిస్తున్నా’అని అమెరికా మిసిసిపీ రాష్ట్రం జాక్సన్‌ ప్రాంతానికి చెందిన రెవరెండ్‌ బిషప్‌ జోసెఫ్‌ కోపాజ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఫాతిమామాత దేవాలయ 45వ వార్షికోత్సవానికి వరంగల్‌ క్యాథలిక్‌ పీఠాధిపతులు, మేత్రాసనం బిషప్‌ డాక్టర్‌ ఉడుముల బాలతో కలసి జోసెఫ్‌ కోపాజ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌కు తాను తొలిసారి వచ్చానని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు చాలా బాగున్నాయన్నారు. తెలంగాణ నచ్చిందని, ఇక్కడి ప్రజల ఆప్యాయత మర్చిపోలేనిదన్నారు. గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వేషధారణ ఆకట్టుకున్నాయని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement